చిన్న పిల్లలు ఏది చేసినా ఎంతోముద్దు అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు తమ వయసు కు మించి ప్రతిభ కనబరుస్తుంటారు. కీర్తనలు పాడటం, జర్నల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పడం.. సంగీత వాయిద్యాలు వాయించడం.. ఇలా ఎన్నో వాటిల్లో తమ టాలెంట్ చూపిస్తుంటారు.
ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది తమ ప్రతిభతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఏది ఏమైనా సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత గుర్తుంది కదా.. కొంత మంది చిన్న పిల్లలు తమ స్థాయికి మించి టాలెంట్ ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ చిన్నారి పియానో వాయించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఎంతగా అంటే ఈ వీడియో ఏకంగా ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..
పట్టుమని ఐదేళ్లు కూడా నిండని చిన్నారి శాల్మలీ వాయించిన పియానో కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పాట కన్నడ కవి కె.ఎస్. నరసింహస్వామి రచించారు. ‘పల్లవగల పల్లవియాలి’ పాటను ఓ మహిళ పాడుతుంటూ.. దానికి తగ్గట్టుగా పియానోపై చిన్నారి శాల్మలీ ట్యూన్ ప్లే చేస్తుంది. శాల్మలీ ప్రతిభ మెచ్చుకుంటూ అనంత్ కుమార్ అనే ట్వివట్టర్ యూజర్ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో శాల్మలీ ప్రతిభకు ముగ్దులైన ప్రధాని నరేంద్ర మోదీ ‘ఈ వీడియో చూడగానే ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.. ఈ చిన్నారి లో అసాధారణమైన ప్రతిభ దాగి ఉంది.. శాల్మలీకి శుభాకాంక్షలు’ అంటూ చిన్నారిని ఆశీర్వదిస్తూ.. వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
పల్లవగల పల్లవియాలి పాట పాడుతుండగా…శాల్మలీ పియానోలో చక్కగా ట్యూన్ చేస్తుంది. ఆ సమయంలో ఆ చిన్నారి హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన ప్రతిభతో ప్రజలతో పాటు ఏకంగా ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేయడంతో మరింత వైరల్ గా మారిపోయింది. చిన్నారిని టాలెంట్ ని ప్రశంసిస్తూ నెటిజన్లు అభినందిస్తూ.. ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం శాల్మలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4
— Narendra Modi (@narendramodi) April 25, 2023