ప్రకృతి విపత్తులను ఎవరమూ ఆపలేం. అవి సృష్టించే బీభత్సం కూడా అంతా ఇంతా కాదు. తాజాగా ఒక రాష్ట్రంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
సిక్కింలో మంచుకొండ విరిగిపడింది. ఈ ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మంది టూరిస్టులు గాయపడ్డారు. సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. హిమపాతం సంభవించిన సమయంలో 150 మంది పర్యాటకులు చిక్కుకున్నారని ఆఫీసర్స్ వెల్లడించారు. టూరిస్టుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 22 మందిని కాపాడామని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగి ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.
ఇవాళ మధ్యాహ్నం గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో ఈ హిమపాతం సంభవించింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సిక్కిం పోలీసులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్, టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని గ్యాంగ్టక్లోని ఆస్పత్రికి తరలించారు. పర్వత ప్రాంతంలో సూచించిన దూరాన్ని దాటి వెళ్లకూడదనే నిబంధనలను పాటించాలని పర్యాటకులకు చెప్పినా.. వారు ఉల్లంఘించి ముందుకు వెళ్లారని ఆఫీసర్స్ చెప్పారు. టూరిస్టులు ఫొటోలు తీసేందుకు, మంచును ఆస్వాదించేందుకు నడుస్తూ వెళ్తుండగా.. ఒక్కసారిగా మంచుచరియ విరిగిపడింది. రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా మంచు పడింది. వీటిపై కొందరు చిక్కుకుపోగా.. మరికొందరు టూరిస్టులు రోడ్డు కిందకు కొట్టుకుపోయారు.
VIDEO | Six tourists dead, several others feared trapped as massive avalanche hits #Nathula in Sikkim. pic.twitter.com/d7lT5AYyp1
— Press Trust of India (@PTI_News) April 4, 2023