మీరు వాహనదారులా! అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం వేలకు వేలు జరిమానా చెల్లించుకోవాల్సి రావొచ్చు. సాధారణంగా మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా పడుతుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే.. అప్పుడు జరిమానా చెల్లిస్తున్నాం. కానీ, ఇకపై అలాంటి పనులు చేసినా జరిమానా వేయనున్నారు. కావున వాహనదారులందరూ ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు కొత్త కాకపోవచ్చు.. కానీ, ఎప్పటికప్పుడు వాటికి మరికొన్ని నియమాలు తోడవుతుంటాయి. కావున బైకులు, కార్లు ఉన్న వారందరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఇప్పటివరకూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సందర్భాల్లో మాత్రమే ఫైన్ విధించిన సందర్భాలు మీరు చూసుంటారు. హెల్మెట్ లేదనో.. డ్రైవింగ్ లైసెన్స్ లేదనో.. లేదంటే మరేదో డాక్యుమెంట్ లేదనో ఫైన్ వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పటి ట్రాఫిక్ పోలీసులకు సోషల్ మీడియా కొత్త ఆయుదంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. వేలకు వేలు జరిమానా విధిస్తున్నారు. అదెలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే.
బైక్ ఆపి దానిపై మనం మీద కూర్చునో లేదా మన పిల్లలను కూర్చో పెట్టి రకరకాల ఫోటోలు దిగుతుంటాం. ఇది తప్పు కాకపోవచ్చు. ఇంకాస్త కొత్తదనం కోరుకునేవారు రన్నింగ్ లో ఉండగానే సెల్ఫీల మోజుతో రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయి. అంతటితో ఊరుకుంటున్నారా! లేదు వాటిని తీసుకెళ్లి సోషల్ మీడియాలో వారికున్న ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదే వారిని పట్టిస్తోంది. మీరు మీ ఫేస్‌బుక్, ట్విట్లర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోషేర్ చేసిన ఆ ఫోటోలలో ట్రాఫిక్ రూల్స్అతిక్రమించినట్లు కనిపిస్తే దేనికి ఎంత అని లెక్క కట్టి మరీ చలానా విధిస్తున్నారు. తాజాగా, నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ మద్యకాలంలో అలాంటి చలానాలు విధించిన వాహనాల ఫోటోలను తమ ట్విట్టర్ హ్యాండిల్‌లోపోస్ట్ చేశారు. ఏకంగా రూ. 25,500 వరకు జరిమానా విధించారు. ఈ మేరకు జరిమానా విధించిన రశీదులను వారు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
రోడ్లపై స్టంట్లు చేసినా, లేదంటే రీల్స్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా, బైక్‌పై హెల్మెట్ లేకుండా తిరిగినా, త్రిపుల్ రైడ్ చేయడం వంటివి చేసిన రూల్స్ ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరు షేర్ చేసిన మూడు రశీదులను గమనిస్తే.. ఒక ఫోటోలో కారు రూల్స్‌ను బ్రేక్ చేశారు. కారును నడిరోడ్డుపై ఆపి, డోర్లు తెరవకుండా డోర్ల నుంచి బయటకు నిలబడ్డారు. దీనికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 25,500 జరిమానా విధించారు. అలాగే మరో కారులో వాళ్ళు కూడా ఇలానే రూల్స్ బ్రేక్ చేశారు. ఒక వ్యక్తి కారు వెనక డోర్లపై కూర్చున్నాడు. దానికి రూ. 23,500 జరిమానా వేశారు.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 25000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/1DlWjZBFRH— Noida Traffic Police (@noidatraffic) March 16, 2023
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 31000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/uTmP46QGWe— Noida Traffic Police (@noidatraffic) March 16, 2023
వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు కొత్త కాకపోయినా వాటిని మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, తద్వారా రహదారులు అందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతాయని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల మీరు ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 22000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/w3orOsyEBO— Noida Traffic Police (@noidatraffic) March 15, 2023