ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఆస్థి అంతస్తులు, కులమతాలు ఇవేమీ ప్రేమకు అడ్డుకావు. నేటి రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిచయాలు సరిహద్దులు దాటుతున్నాయి.
వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో విరుచుకుపడుతున్నాడు. భారీ వర్షాల ధాటికి చెరువులు, వాగులు ఉప్పొంగుతూ వరదలు సంబవిస్తున్నాయి. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయి
హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. దాన్ని సర్వ్ చేసినందుకు ఛార్జ్ వేయడం ఏంటి? ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారా? మరి రెస్టారెంట్స్ లో సర్వీస్ ఛార్జ్ ఎందుకు అడుగుతున్నారు? ఈ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా? అయినా సర్వీస్ చేసినందుకే కదా వెయిటర్స్ కి టిప్ ఇస్తున్నాం. మరి సర్వీస్ ఛార్జ్ ఎందుకు? అసలు సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? వినియోగదారుల ఫారం ఏం చెబుతోంది?
వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు వారం రోజులు పడ్డ కష్టం ఒక్కరోజు మర్చిపోవాలని అనుకుంటారు ప్రతిఒక్కరు. కొంతమంది ఎంజాయ్ కోసం సినిమాలు, షాపింగ్ మాల్స్ వెళ్లడం చేస్తారు. కొంతమంది కుటుంబంతో మంచి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు.
తన కోపమే తన శత్రువు. వినడానికి ఇది పాత సామెత అయినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కోపం రావడం సహజం. కానీ అలాంటి సమయంలోనే మన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
సాధారణంగా తప్పిపోయిన వాళ్లు తిరిగి రారని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతుంటారు.. కానీ వాళ్లు కళ్ల ముందు ప్రత్యక్షం అయితే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులుఉండవు.
మనిషి ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో ఎవరూ చెప్పలేరు.. ఈ మద్య కాలంలో వరుసగా గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిని వారు ఒక్కసారే లోకాన్ని వదిలిపోతున్నారు.
ఈ మద్య మనుషులు డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల రసాల చివరికి చిన్నా పెద్ద తాగే పాలు సైతం కల్తీ చేస్తున్నారు.
తన స్నేహితుడికి జరిగిన సంఘటన మరో కుటుంబంలో జరగకూడదు అని ఓ ఉద్యమాన్నే ప్రారంభించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర. ఇప్పటి వరకు 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఫ్రెండ్ కు జరిగిన సంఘటన మరోకరికి జరగకూడదు అని పోరాాడుతున్నాడు.