సినీ తారలకంటే సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు చేసే రచ్చ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. సీరియల్స్ లో అంటే.. యాక్టింగ్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియాని మించిన ఎంటర్టైన్ మెంట్ ఎక్కడ పండిస్తున్నారు.. అనంటే బుల్లితెర కార్యక్రమాలలో. అవును.. సీరియల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో చేసే రచ్చతో పాటు టీవీ షోస్ లో పాల్గొని మరింత హైలైట్ అవుతున్నారు.
సినీ తారలకంటే సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు చేసే రచ్చ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. సీరియల్స్ లో అంటే.. యాక్టింగ్ తో మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా సీరియల్స్ కన్నా ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ ని అందిస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాని మించిన ఎంటర్టైన్ మెంట్ ఎక్కడ పండిస్తున్నారు.. అనంటే బుల్లితెర కార్యక్రమాలలో. అవును.. సీరియల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో చేసే రచ్చతో పాటు టీవీ షోస్ లో పాల్గొని మరింత హైలైట్ అవుతున్నారు. తాజాగా ఓ పాపులర్ షోలో సీరియల్ నటి శ్రీవాణి తన భర్తతో కలిసి సందడి చేసింది.
ఇటీవల బుల్లితెరపై పాపులర్ అయిన షోలలో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోలో.. సినీ నటులు శివబాలాజీ, స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రామ్ లో బుల్లితెర సీరియల్ జంటలతో పాటు జబర్దస్త్, బిగ్ బాస్ లో అలరించిన కపుల్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో అంతా సరదాగానే సాగింది. కానీ.. సీరియల్ నటి శ్రీవాణి తన భర్తతో కలిసి స్టేజ్ పై చేసిన ఓ రొమాంటిక్ టాస్క్ ప్రస్తుతం హైలైట్ అవుతోంది. శ్రీవాణి తన భర్తతో కలిసి ఐస్ క్రీమ్స్ ని పెదాలతో.. ఓ బాక్స్ లో నుండి ఇంకో బాక్స్ లోకి చేర్చాల్సి ఉంది. ఆ విధంగా వారిద్దరూ చేసిన టాస్క్ రొమాంటిక్ గా మారిపోయింది. ప్రెజెంట్ వీరి టాస్క్ పై కామెంట్స్ కూడా రొమాంటిక్ గానే వినిపిస్తున్నాయి. మరి.. నటి శ్రీవాణి చేసిన రొమాంటిక్ టాస్క్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.