బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటూ వస్తోంది. దాదాపు పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్న జబర్దస్త్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే జడ్జిల స్థానాలలో సీనియర్ నటులు, సింగర్స్ ఇలా మారుతున్నారు. అలాగే యాంకర్స్ విషయంలో కూడా అనసూయ తర్వాత కొద్దివారాలకే మార్పులు జరిగాయి. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ తర్వాత రష్మీనే హ్యాండిల్ చేసింది. కానీ.. ఇటీవలే కొత్తగా సీరియల్ నటి సౌమ్య రావుని యాంకర్ గా ప్రెజెంట్ చేశారు నిర్వాహకులు. ఇక ఎప్పటిలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో జడ్జి స్థానాలలో కమెడియన్ కృష్ణ భగవాన్ తో పాటు సీనియర్ నటి ఖుష్బూ కనిపిస్తోంది. కొత్త యాంకర్ ఎంట్రీ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది. అల వైకుంఠపురం సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సౌమ్య.. రెడ్ డ్రెస్ లో ముద్దబంతిలాగే మెలికలు తిరుగుతూ డాన్స్ చేసింది. ఇక అందరి పెర్ఫార్మన్స్ లతో పాటు హైపర్ ఆది, సౌమ్యల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అందుకే ప్రోమో చూసినవారంతా సౌమ్య డాన్స్ తో పాటు ఆదితో ఆమె కెమిస్ట్రీ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు సెకండ్ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది. మీరు ఓ లుక్కేయండి!