ప్రతిభ ఉన్న కమెడియన్లను ప్రోత్సహించి.. అవకాశం ఇస్తున్న రియాలిటీ షో జబర్దస్త్. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ఇలా ఎంతోమంది సక్సెస్ రుచి చూశారు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి.. ఇప్పుడు ఏమీ లోటు లేదు అనే స్థితికి రావడానికి కారణం జబర్దస్త్ అనే అంటారు. జబర్దస్త్ లో అనేది ఒక కుటుంబం. ఈ షోలో చేసే కమెడియన్స్ అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉంటారు. అలాంటి జబర్దస్త్ ఇంతలా ప్రేక్షకులని సుదీర్ఘ కాలంగా అలరిస్తుందంటే దానికి వెనుక.. కమెడియన్లు, వాళ్ళు పడే స్ట్రగుల్ చిన్నదేమీ కాదు. అవకాశం ఇవ్వడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. స్కిట్ ని నిలబెట్టడం కోసం వాళ్ళు పడే తంటాలు మామూలుగా ఉండవు.
అయితే వీరు ఈ స్టేజ్ లో ఉండడానికి కన్నతల్లిదండ్రులు కూడా ఒక కారణమే. నచ్చిన రంగంలోకి వెళ్తామంటే అడ్డు చెప్పకుండా వెళ్ళమని పంపించడం నిజంగా అభినందించాలి. పిల్లలు ఎంత ఎత్తుకి ఎదిగినా వచ్చిన దారి మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు. ప్రతీ ఒక్కరికీ తమ తల్లిదండ్రులని ప్రేక్షకులకి పరిచయం చేయాలని ఉంటుంది. అందుకే మల్లెమాల యాజమాన్యం.. కమెడియన్ల కుటుంబ సభ్యులను కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే పలువురి కమెడియన్ల కుటుంబ సభ్యులను స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో స్కిట్ చేయించారు. తాజాగా జబర్దస్త్ నరేష్ తండ్రిని కూడా స్టేజ్ పైకి తీసుకొచ్చి స్కిట్ చేయించారు.
గతంలో నరేష్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో నరేష్ తండ్రిని పరిచయం చేశారు. అయితే అప్పుడు స్కిట్ ఏమీ చేయలేదు. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో నరేష్ తండ్రి స్కిట్ లో నటించారు. ఈ స్కిట్ లో తన తండ్రి మీద నరేష్ బాగానే పంచులు వేశాడు. అయితే నరేష్ తండ్రి మాత్రం డైలాగ్స్ చెప్పకుండా.. ఎక్స్ ప్రెషన్స్ తోనే స్కిట్ ని లాగించేస్తున్నారు. కెవ్వు కార్తీక్ నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి అంటే.. నరేష్ తండ్రి.. రైట్ రైట్ అని అంటారు. దానికి నరేష్.. ‘నాన్న నిన్ను సెలబ్రిటీని చేద్దామనుకుంటున్నాను. ఇంకా నువ్వు రైట్ రైట్ అనుకుంటానే ఉన్నావ్” అంటూ పంచ్ వేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీ అబ్బాయ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. వెళ్ళండి సార్’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.