ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్ , మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. . తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కరోనా తీవ్రత నుంచి కోలుకుంటున్నాడు. అయితే తన హాస్పిటల్ బిల్లు ఏడు లక్షల వరకూ అయింది. కానీ నంద్యాల రవి కుటుంబానికి అంత పెద్ద మొత్తం చెల్లించే స్తోమత లేదు. ఇంకా చికిత్స పొందుతూనే ఉన్న నంద్యాల రవికి ఆర్థిక పరిస్థితి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అది గమనించిన నటుడు సప్తగిరి మానవత్వాన్ని చాటుకున్నాడు. తన వంతు సాయంగా లక్ష రూపాయలను నంద్యాల రవి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అంద చేస్తానని ప్రకటించారు. విషయం తెలుసుకున్న కమెడియన్ సప్తగిరి వెంటనే తన వంతు సాయంగా రవి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇక గతంలోనూ కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి కూడా సప్తగిరి తన వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రవి కుటుంబానికి కూడా తన వంతు సాయాన్ని అందించి మరోసారి సప్తగిరి మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతమున్నవిపత్కర పరిస్థితుల్లో నాకేమని అనుకోకుండా తన దర్శకుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సప్తగిరి వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. మరి ఇతర సెలబ్రెటీలు కూడా స్పందిస్తారేమో చూద్దాం. .