సదరు డైరెక్టర్ ఒక మూవీలో తనని ఎంపిక చేసాడని తొలుత డైరెక్టర్ ఆ మూవీ లో తనది మంచి క్యారక్టర్ అని చెప్పి తీసుకున్నాడని చెప్పింది. కానీ ఆ తర్వాత దర్శకుడు తనని అసభ్యకరమైన వస్త్రాలు వేసుకోమని చెప్పడమే కాకుండా..
కళ..సృష్టి ఆరంభం కంటే ముందే ఈ విశ్వం లో పుట్టిన దైవాంశ సంభూతం యొక్క రూపమే కళ.. కళకి ఎన్నో రూపాలు. అలాంటి ఒక రూపమే సినిమా. సినిమా అనే ఒక కళకి పతన దశలో ఉన్న ఒక మనిషి జీవితాన్ని అత్యంత స్థాయికి తీసుకెళ్లగలిగే శక్తి ఉంది. అలాగే సినిమా అనేది చెడిపోతున్న సమాజాన్ని బాగుచేసే ఒక స్వతంత్ర సంస్థ కూడా. అంతటి ప్రాముఖ్యత ఉన్న సినిమా కి కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తుంటుంది. వాళ్లకి కళ ఎంతటి పవిత్రమైందో తెలియదు.ఒకప్పుడు తన అందంతో,నటనతో మరి ముఖ్యంగా తన డాన్స్ తో తెలుగు సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపిన నటీమణి ని ఒక దర్శకుడు తన సినిమా లో అసభ్యంగా నటించాలని ఒత్తిడి చేసి కళ కి ఉన్న పరువుని తీసాడు. ఈ విషయాన్నే సదరు నటీమణి చెప్పటం తో తాజాగా ఈ వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తుంది
రక్ష..సోషల్ మీడియా వల్ల నేటి తరానికి కూడా తెలిసిన నటి. ప్రేమలేక సినిమాలోని చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి పోమాకే చిన్నదాన అనే పాట ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. ఒక మేల్ యాక్టర్ రక్షని ఉద్దెశించి ఆ పాట పాడతాడు. ఆ పాటలో పసుపు రంగు చీరలో నెత్తిన గంపని పెట్టుకొని రక్ష ప్రదర్శించిన అభినయం దక్షిణ భారత దేశ కుర్రకారు మొత్తని ఒక ఊపు ఊపేసింది. అప్పుడే పూచిన గులాబీ ఎంత అందంగా ఉంటుందో రక్ష కూడా ఆ పాటలో అంతే అందంగా ఉంటుంది. అందం, నటన రెండు కలగలిసి ఉన్న రక్ష ఎన్నో సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో డాన్స్ చెయ్యడమే కాకుండా ఎన్నో సినిమా ల్లో మంచి కేరక్టర్స్ లో నటించి మంచి నటీమణి అనే పేరుని కూడా తెచ్చుకుంది.
చాలా రోజుల తర్వాత ఈ మధ్యన రక్ష ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ రక్ష మంచి పేని చేసిందని మెచ్చుకోవడం తో పాటు రక్ష లాంటి నటీమణులు ఈ రోజుల్లో చాలా అవసరం కూడా అని అంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే రక్ష 1990వ దశకం లో చాలా తెలుగు సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఒక సినిమా డైరెక్టర్ నుండి తనకి ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పింది. సదరు డైరెక్టర్ ఒక మూవీలో తనని ఎంపిక చేసాడని తొలుత డైరెక్టర్ ఆ మూవీ లో తనది మంచి క్యారక్టర్ అని చెప్పి తీసుకున్నాడని చెప్పింది. కానీ ఆ తర్వాత దర్శకుడు తనని అసభ్యకరమైన వస్త్రాలు వేసుకోమని చెప్పడమే కాకుండా బోల్డ్ గా నటించాలని కూడా ఒత్తిడి చేసాడని చెప్పింది. దాంతో నేను డైరెక్టర్ తో మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. రక్ష చెప్పిన ఈ మాటలు తాజగా సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ రక్ష ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయటకి చెప్పలేదు. రక్ష చేసిన పనికి మాత్రం సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభినందలు తెలుపుతున్నారు