తనదైన పంచులతో, హాస్యంతో కడుపుబ్బా నవ్వించే కిరాక్ ఆర్పీ.. బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టారు. కర్రీ పాయింట్ పెట్టాలన్న పదేళ్ల కలని ఇన్నాళ్లకు నిజం చేసుకున్నారు. కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు కాగా.. నెల్లూరు చేపల పులుసు యమా టేస్టుగా ఉంటుందని ఆయన స్నేహితులు లొట్టలేసుకుంటూ తినేవారట. అందుకే తన మిత్రులతో పాటు హైదరాబాదీయులకి కూడా నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాలని హైదరాబాద్ లో కర్రీ పాయింట్ బిజినెస్ ని ప్రారంభించారు. కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరిట కర్రీ పాయింట్ ని పెట్టారు. చేపల పులుసులు లొట్టలేసుకుంటూ తినే పులుసు ప్రియుల కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల చేపల పులుసు కర్రీని వందిస్తున్నారు. ఇక చేపల పులుసు తయారు చేయాలంటే ఇది చదవండి.. ‘నెల్లూరు చేపల పులుసు రెసిపీ’.
చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు, సన్న చేపల పులుసు అన్నీ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. చేతికి గ్లౌజులు వేసుకుని.. తలపై చెఫ్ క్యాప్ పెట్టుకుని చాలా శుభ్రంగా వండుతున్నారు. అయితే ఈ కర్రీ పాయింట్ కి ప్రత్యేకించి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఈ కర్రీ పాయింట్ లో చేపల పులుసులు అంత రుచిగా రావడానికి ఆర్పీ పాటించే చిట్కాలు ఏమిటి? వంటి అనేక విషయాలను సుమన్ టీవీతో పంచుకున్నారు. ఆ వీడియో కింద ఉంది చూసేయండి. వీడియో చూసి తినాలనిపిస్తే.. కూకట్ పల్లిలో ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కి వెళ్లాల్సిందే.
3rd ఫేజ్, వాటర్ ట్యాంక్ ఎదురుగా, మంజీరా మెజిస్టిక్స్ హోమ్స్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, హైదరాబాద్.