శాంతి భద్రతలను కాపాడి నేరాలను అరికట్టడంలో పోలీసుల కృషి ఎనలేనిది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంటారు.
శాంతి భద్రతలను కాపాడి నేరాలను అరికట్టడంలో పోలీసుల కృషి ఎనలేనిది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంటారు. పండుగ పబ్బాలు మరిచి కుటుంబాన్ని విడిచి ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటారు పోలీసులు. కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో దుండగులు, నేరస్తులను నిలువరించే క్రమంలో ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని ఘటనల్లో చేతిలోని గన్ మిస్ ఫైర్ అయి పోలీసులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా పాతబస్తీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ అవ్వడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరిగిందంటే?
నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్ హైదరాబాద్ లోని పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులు ముగించుకుని, రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చేతిలోని గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తీవ్రగాయాలపాలైన శ్రీకాంత్ ను అక్కడున్నవారు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మరణిచాడు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గన్ మిస్ ఫైర్ కావడానికి గల కారణాలను విశ్లేసిస్తున్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.