బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. దీంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బిగ్ బాస్ నిర్వహించాలని మేనేజ్‌మెంట్ ప్లాన్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సీజన్‌ను జూన్ నెలలో నిర్వహించాలని నిర్వాహకులు భావించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేస్తూ ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో షోను ప్రారంభించడం సరైనది కాదని, కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తుండగా, తాజాగా ఆగస్టు నెలలో ఈ షోను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రోగ్రాంను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు జూనియర్ ఎన్టీఆర్. సీజన్ వన్‌లో యమ అట్రాక్ట్ చేసిన ఆయన బిగ్ బాస్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. దీంతో తదుపరి సీజన్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి వచ్చేసింది. దీంతో ప్రతి ఏడాది సరికొత్తగా ప్లాన్ చేస్తూ బిగ్ బాస్ ద్వారా వినోదం పంచుతున్నారు నిర్వాహకులు. అయితే దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బిగ్ బాస్‌ను కూడా దెబ్బ కొట్టేసిందని టాక్ మొదలైంది.
కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. నిజానికి గతేడాది కూడా కారోనా మహమ్మారి కారణంగా బిగ్ బాస్ కొన్ని నెలలు ఆలస్యంగా మొదలైంది. అంతకుముందు బిగ్ బాస్-4 క్యాన్సిల్ అవ్వొచ్చు అనే రూమర్స్ కూడా షికారు చేశాయి. కానీ చివరకు 106 రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాడు బిగ్ బాస్. వచ్చే సీజన్ అంతా తెలియని మొహాలు కాకుండా తెలిసిన వాళ్లనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వివాదంలోనే వినోదం ఎక్కువగా ఉండేలా డోస్ పెంచబోతున్నారు నిర్వాహకులు. అందుకే నెక్ట్స్ సీజన్‌పై అంచనాలు మొదలైపోయాయి. చూద్దాం ఈ బిగ్ బాస్ 5 కరోనా 2 వేవ్ ని ఎలా ఎదుర్కొంటాడో!?.