బిగ్ బాస్-7 ప్రోమోలు బయటకి రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కంటెస్టెంట్స్ పై పడింది. ఎవరెవరు ఈ సీజన్ లో పోటీ చేయబోతున్నారు అన్న బజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లోకి మొగలిరేకులు హీరో సాగర్ వచ్చి చేరారు.
బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే రియాలిటీ షో. ఇప్పటికే 6 సీజన్స్ పూర్తికాగ.. త్వరలోనే 7వ సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కాన్సెప్ట్ బేస్డ్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ.. నిర్వాహకులు బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రోమోలో నాగ్.. కుడి ఎడమైతే అని ట్యాగ్ లైన్ వాడటంతో షోపై ఇప్పటికే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లో అన్నీ కొత్త గేమ్స్, కొత్త టాస్క్స్, కొత్త రూల్స్ ఉండబోతున్నాయట. మరి.. గేమ్ ప్లాన్ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకుంటున్న నిర్వాహకులు.. కంటెస్టెంట్స్ విషయంలో ఫోకస్ చేయకుండా ఉంటారా? సీజన్ -7 కోసం బెస్ట్ సెలబ్రెటీస్ ను రంగంలోకి దించబోతున్నారట. ఈ నేపథ్యంలోనే మొగలి రేకులు హీరోగా ఫేమస్ అయిన ఆర్టిస్ సాగర్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.
మొగలిరేకులు సీరియల్ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులో సాగర్ ఆర్.కే. నాయుడు క్యారెక్టర్ లో సూపర్బ్ గా నటించి, మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కేవలం.. ఈ క్యారెక్టర్ కోసమే అప్పట్లో సీరియల్ చూసిన ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మొగలిరేకులు పూర్తి అయ్యాక.. సాగర్ చాలా సినిమాల్లో మంచి రోల్స్ చేశారు. హీరోగా కూడా చాలా సినిమాలు చేసి మెప్పించారు. అయితే.., కారణాలు ఏవైనా ఆయనకి రావాల్సినంత స్టార్డం ఇండస్ట్రీలో రాలేదు. అయినా.. కూడా సాగర్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన కెరీర్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు. సరిగ్గా.. ఇలాంటి సమయంలో ఆయనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
సాగర్ ప్రస్తుతం ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన కావాలి అనుకుంటే సీరియల్స్ లో అవకాశాలకు కొదవ ఉండదు. కానీ.., సాగర్ మాత్రం సినీ ఇండస్ట్రీ వైపు చుస్తున్నారు. ఒకవేళ బిగ్ బాస్ లో గనుక.. ఎక్కువ కాలం ఉండకలిగితే సాగర్ క్రేజ్ దృష్ట్యా మంచి రీచ్ రావచ్చు. ఆ తరువాత ఎలాగో సినిమాల్లో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ కారణంగానే సాగర్ కూడా బిగ్ బాస్ ఆఫర్ కు యస్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రెమ్యూనరేషన్ కూడా రోజుకి లక్షల్లో ఉండబోతున్నట్టు సమాచారం. మరి.. సాగర్ గనుక.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. ఒకప్పటి ఆయన లేడీ ఫ్యాన్స్ అండగా నిలుస్తారో, లేదో చూడాలి.