తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్నా బిగ్ బాస్ త్వరలో 7వ సీజన్ కి సిద్దం అవుతుంది. ఈసారి రచ్చ మాములుగా ఉండదు.. కొత్త రూల్స్, కండీషన్స్ అప్లై అంటూ కింగ్ నాగార్జున ప్రమోలో తెలిపారు.
బాలీవుడ్ బుల్లితెరపై సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సెస్సేషన్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇతర భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో మొదలు పెట్టారు.. ప్రముఖ హీరోలు హూస్ట్ గా చేస్తున్నారు. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హూస్ట్ చేశారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తయి.. 7వ సీజన్ కి రంగం సిద్దం అయ్యింది. ఇటీవల నాగార్జున కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ సందడి చేశారు. అంతేకాదు ఈ సారి సరికొత్త టాస్కులు, రూల్స్, కండీషన్స్ ఉంటాయని చెప్పారు నాగరాజు. అంతేకాదు ఈసారి బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు తల్లీకూతుళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన బిగ్ బాస్ ఇప్పుటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈసారి సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు కింగ్ నాగార్జున ఈ మద్య ప్రోమోలో హింట్ ఇచ్చారు. టాస్కులు, రూల్స్ ఇతర అంశాలు వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ వివరాలు మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ పలువురు సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బుల్లితెర, వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హవా కొనసాగించిన నటి, ఆమె కూతురు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె కూతురు కూడా మీడియాలో తెగ పాపులర్ అయ్యింది.
బిగ్ బాస్-7 హౌజ్ లోకి పలువురు టీవీ, సినీ నటులు ఉండబోతున్నారని.. అమరదీప్ చౌదరి-తేజస్విని జంట, యూట్యూబర్ శ్వేతానాయుడు, దీపికా పిల్లి, జబర్ధస్త్ పవిత్ర, వర్ష, శోభాశెట్టి, సింగర్ మోహన్ భోగరాజులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఆమె కూతురు సుప్రిత కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై ప్రస్థానం మొదలు పెట్టిన సురేఖావాణి వెండితెరపై పలు కామెడీ పాత్రలతో అలరించారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో హాట్ లుక్ తో దర్శనమిస్తూ హంగామా సృష్టించారు. సురేఖావాణి కూతురు సుప్రిత ఇటీవల యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్ తో ఫోటోలు, వీడియోలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతూ వస్తుంది. రీల్స్ లో తల్లీకూతుళ్లు డ్యాన్స్, డైలాగ్స్ తో తెగ హల్ చల్ చేస్తున్నారు. సుప్రిత షార్ట్ ఫిలిమ్స్, టీవీ షోల్లో యాక్ట్ చేస్తుంది. బిగ్ బాస్ లోకి సుప్రిత ఎంట్రీ ఇస్తే తనకు మంచి ఫ్లాట్ ఫామ్ అవుతుందని అంటున్నారు. మరి బిగ్ బాస్ -7 లోకి తల్లీకూతుళ్ళు ఎంట్రీ ఇస్తే రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు నెటిజన్లు.