తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సిజన్ కి సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన కింగ్ నాగార్జున ప్రోమో ఈ మద్య రిలీజ్ చేశారు మేకర్స్. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ నాగార్జున సందడి చేశారు.
బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఇతర భాషల్లో బిగ్ బాస్ రియల్టీ షోని తీసుకువచ్చారు. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హూస్ట్ చేశారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హూస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 కి రంగం సిద్దం అయ్యింది. దీనికి సంబంధించి నాగార్జున ప్రోమో రిలీజ్ చేశారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ ఈసారి కొత్త టాస్కులు, కొత్త రూల్స్ అంటూ సందడి చేశారు. తాజాగా కింగ్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షోకు సంబంధించి ఏపీ హైకోర్టు బుధవారం అక్కినేని నాగార్జున కి నోటీసులు జారీ చేసింది. టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ పై ఎంతగా ప్రశంసలు వస్తాయో.. అంతకన్నా ఎక్కువ విమర్శలు కూడా వచ్చాయి. గతంలో ఈ షో పై సీపీఐ నారాయణ చాలా సార్లు విమర్శలు చేశారు. బిగ్ బాస్ చూడటం వల్ల చిన్నపిల్లలు, యువత చెడిపోతున్నారని ఆయన ఆరోపించారు. బిగ్‌బాస్ రియాలిటీ షో లో కంటెస్టెంట్ల మధ్య అశ్లీలత, అసభ్యత సన్నివేశాల వల్ల యువత పెడదారి పడుతోందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నాగార్జునతో పాటు ‘స్టార్ మా’కి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అంతకు ముందే ప్రభుత్వం, స్టార్ మా యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ బిగ్ బాస్ పై విమర్శలు రావడంతో పాటు ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ షోని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవల దీనికి సంబంధించిన నాగార్జున ప్రోమో రిలీజ్ నెట్టింట సందడి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈ షోని ఆపాలంటూ పిటీషన్ దాఖలు కావడం బిగ్ బాస్ అభిమానులకు అశ్చర్యం అనిపిస్తుంది.