ఆంజనేయుడికి తన శక్తి ఎంతో తెలియనట్లే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కి కూడా తన శక్తి ఎంతో తెలియదు. నాగార్జున కి ఉన్నఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు.. ఎందరో వీరాభిమానులు నాగార్జునకి ఉన్నారు.
ఆంజనేయుడికి తన శక్తి ఎంతో తెలియనట్లే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కి కూడా తన శక్తి ఎంతో తెలియదు. నాగార్జున కి ఉన్నఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు.. ఎందరో వీరాభిమానులు నాగార్జునకి ఉన్నారు. ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తానికి యువసామ్రాట్ నాగార్జున నే సుప్రీం హీరో అని సాక్షాత్తు ఇండియా లో నే నెంబర్ వన్ స్థానం లో ఉన్నపత్రికలే చెప్పాయి. నాగార్జున సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులకి పండగ రోజు.. కళ కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల పాత్రల్ని పోషించి మెప్పించిన ఒకే ఒక్క భారతీయ నటుడు నాగార్జున. క్లాస్ ,మాస్,కామెడీ ,భక్తి ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న సినిమా లు చేసిన హీరో నాగార్జున. ఆయన సినిమాకి సంబంధించిన సినిమా టైటిల్స్ కూడా చాల భిన్నంగా ఉంటాయి. తాజాగా నాగార్జున కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
నాగార్జున.. ఈ ఒక్క పేరు చాలు డల్ గా ఉన్న తెలుగు సినిమాని రేసుగుర్రంలా పరుగెతించడానికి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని రికార్డు లేదు. నాగార్జునలా హెయిర్ స్టైల్ ఉండాలి, నాగార్జునలా డ్రెస్ సెన్స్ ఉండాలి,నాగార్జునలా నడవాలి, నాగార్జునలా తమ శత్రువుల్ని కంటి చూపుతోనే బెదిరించాలి అని అనుకునే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా ఉంటారు అసలు నాగార్జున సినిమా మొదటి ఆట టిక్కెట్ల కోసం నాగార్జున ఫాన్స్ అండ్ నాగార్జున ఫ్యాన్సే గొడవలు పడేవారంటే నాగార్జున కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ని అర్ధం చేసుకోవచ్చు. అలాగే నాగార్జున సినిమాలకి సంబందించిన సినిమా పాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి.
నాగార్జున లేటెస్టుగా ది ఘోస్ట్ అనే సినిమాలో నటించాడు. నాగార్జునతో పాటు అభిమానులు కూడా ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయం అయ్యింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాగార్జున గట్టి పట్టుదలతో ఉన్నాడు. లేటెస్టుగా నాగార్జున చేయబోయే కొత్త సినిమా టైటిల్ ఒకటి పలానా అనే వార్త బయటకి వచ్చింది. గలాటా అనే సూపర్ మాస్ టైటిల్ తో నాగార్జున సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా టైటిల్ గురించి విన్న అభిమానుల ఆనందానికి ఐతే అవదులు లేవు. తమ అభిమాన కథానాయకుడి ఇమేజ్ కి తగినట్లే సూపర్ మాస్ టైటిల్ దొరికిందని నాగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.