తమన్ సంగీత సారథ్యంలో అమెరికాలో ‘ఆహా’ సమర్పించు ‘అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ షోను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే షో లతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుని, డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో ‘అలా అమెరికాపురములో’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్స్‌ను ‘ఆహా’ సమర్పిస్తోంది. […]
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ టాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఎన్టీఆర్ ప్రశంసలను అందుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తోనే నెట్టుకు వస్తోంది. ఈ సీజన్ లో కొత్తదనం ఏమీ లేకపోయినా, ఎన్టీఆర్ తన హూందా తనంతో గట్టెక్కిస్తున్నాడనే చెప్పాలి. […]
బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. […]