మద్యం సేవించడం మన సమాజంలో అనాదిగా ఉంది.. అయితే ఒకప్పుడు కేవలం రాజులు, ప్రభువులు, ఉన్నత వర్గం వారు మాత్రమే మద్యపానం చేసేవారు. ఇక సామాన్యులు మద్యం సేవించడం మహాపాపంగా భావించేవారు. అలాంటి వారిని చీడపురుగుల్లా చూసేవారు. మరి ఇప్పుడు.. మందు తాగనివాడు.. మనిషే కాదు.. అన్నట్లు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు.. పోను పోను.. వ్యసనంగా మారి ఆ వ్యక్తితో పాటు అతడి మీద ఆధారపడిన అందరి జీవితాలను నాశనం చేస్తుంది. ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాల వెనక ప్రధాన కారణం మద్యపానం. అయితే ప్రస్తుత సమాజంలో ఈ దురలవాటు పెరగడానికి సెలబ్రిటీలు కూడా కారణమే అంటున్నారు మానసకి విశ్లేషణ నిపుణులు.
ప్రస్తుతం మన దేశంలో పొగాకు, మద్యపానానికి సంబంధించిన ప్రకటనలు నిషేధం. అందుకే కంపెనీలు అతి తెలివిగా తమ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం అదే బ్రాండ్ పేరు మీద ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఇతర ఉత్పత్తులను తీసుకువచ్చి మద్యం బ్రాండ్లకు పరోక్ష ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ఇలాంటి యాడ్స్‌లో నటించేవారంతా పేరు మోసిన సెలబ్రిటీలే. అది చూసి వారి ఫ్యాన్స్ ఆయ ఉత్పత్తులును వాడి వ్యసనాల బారిన పడుతున్నారు. ఈ విషయాలన్నింటిని సుమన్ టీవీ నిర్వహిస్తున్న ఖడ్గం కార్యక్రమంలో వివరించారు ఆల్కహాలిక్స్ అనానీమస్ సంస్థ ప్రతినిధులు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ గీత మాట్లాడుతూ.. ‘ఓ సెలబ్రిటీ నోటిలో పాన్ మసాలా వేసుకుని నములుతాడు.. అద చూసి అమ్మాయి పడిపోతుంది. ఈ యాడ్ చూసిన వారు ఏమనుకుంటారు. అరే పాన్ మసలాకే ఆ అమ్మాయి పడిపోయింది అని భావిస్తారు. ఎందుకంటే మన సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువ. మరి అలాంటి వారు ఈ యాడ్‌ని చూసి ఇలానే ఫీలవుతారు.. అరే మన హీరో ఇలా చేశాడు.. మనం కూడా అలానే చేయాలని భావిస్తారు. ఫలితంగా ఎందరో ఈ చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. మరి ఇలాంటి యాడ్స్ ద్వారా సదరు సెలబ్రిటీలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు తాము చిన్నప్పటి నుంచి హీరోలను చూసి ఎలా ఇన్‌స్పైర్ అయ్యారో.. వారిని చూసి ఎలాంటి అలవాట్లు నేర్చుకున్నారో వెల్లడించారు. అలా హీరోలను చూసి ప్రారంభించిన అలవాటు.. కాస్త చివరకు వ్యసనంగా మారి.. తమ జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అయ్యాయో తెలిపారు. ఇక ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ ఆల్కహాలిక్స్ అనానీమస్ సంస్థ ఎలాంటి సాయం చేసిందో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. మరి సెలబ్రిటీల వల్ల కూడా ఇలాంటి వ్యసనాలు పెరుగుతున్నాయి అనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.