సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 100W బల్బులా ధగధగ మెరిసిపోయింది. ఆ దృశ్యాలను తిలకించాలనుకుంటే కింద చూసేయండి..
ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన ముంబై భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 193 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముంగిట ఉంచింది. అయితే ఈ మ్యాచులో ఎస్‌ఆర్‌హెచ్ సారథి అయిడిన్ మార్క్‌రమ్ క్యాచింగ్ మెషిన్ వలే సూపర్బ్ క్యాచులు అందుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
సన్‌రైజర్స్ జట్టు ఎప్పుడు..? ఎక్కడ..? మ్యాచ్ ఆడుతున్నా కావ్య పాప(కావ్య మారన్) హాజరవుతూనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది అభిమానులకు ఆనందాన్నే పంచేదే. కావ్య పాప నుండి అలాంటి ఎక్సప్రెషన్స్ ఉంటాయి. జట్టు ఓడిపోతున్న సమయంలో కాస్త నిరాశగా కనిపించినా.. జట్టు విజయం వైపు అడుగులు వేస్తుందంటే ఆమె ముఖం 100W బల్బులా మెరిసిపోతుంటుంది. కావ్య పాప అందం కూడా అభిమానులను ఆకట్టుకునేదే. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం.. ఆమె సొంతం. ఇక నేడు సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు తేలిపోయారనే చెప్పాలి. ముంబై బ్యాటర్లకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది.. ఎస్‌ఆర్‌హెచ్ సారథి గురుంచే. క్యాచింగ్ మెషిన్ వలే మార్క్‌రమ్ సూపర్బ్ క్యాచులు అందుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. మార్క్‌రమ్.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకోగానే.. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించింది. ముసి ముసి నవ్వులు చిందిస్తూ అభిమానులను కట్టిపడేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఎస్‌ఆర్‌హెచ్ గెలవకపోయినా.. మీ నవ్వు చూశాం ఇక చాలు..’ అంటూ సన్‌రైజర్స్ అభిమానులు ఆమె మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఎస్‌ఆర్‌హెచ్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లను ఓడించి వరుసగా రెండు విజయాలు అందుకుంది.
Aiden Markram is a catching machine 💪#SRHvMI | #IPL2023 pic.twitter.com/NwAGGN6TEA
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2023
Kavya Maran jumps in Joy ❤️ when Marco Jansen takes Suryakumar Yadav Wicket #SRHvMI #SRHvsMI #kavyamaran pic.twitter.com/0ZvKEaKpnl
— Virat chaudhary (@_Viratchaudhary) April 18, 2023