పాకిస్థాన్ పేస్ బౌలింగ్ తో అంతా ఈజీ కాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ పేస్ బౌలింగ్ జట్లలో పాక్ జట్టు ఒకటి.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది పాకిస్థాన్. మంగళవారం శ్రీలంకలోని రాజపక్సా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 47.1 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 3, రషీద్ ఖాన్, నబీ రెండేసి వికెట్లతో పాక్ ని తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. అయితే లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం 59 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ చేసి తమ ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పింది. పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. షాహీన్ షా అఫ్రిదీ ఎప్పటిలాగే ప్రారంభంలో రెండు వికెట్లు తీసుకోగా హారిస్ రౌఫ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. మరో పేసర్ నజీమ్ షాకి ఒక వికెట్ దక్కింది.
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ తో అంతా ఈజీ కాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ పేస్ బౌలింగ్ జట్లలో పాకిస్థాన్ జట్టు ఒకటి. షాహీన్ అఫ్రీది, నజీమ్ షా, హారిస్ రౌఫ్ ల పేస్ త్రయాన్ని తట్టుకొని నిలబడాలంటే శక్తికి మించిన పనే. ఇప్పటికే వారేంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నారు. ప్రపంచ క్రికెట్ లో గ్రేట్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షాహీన్ అనుకుంటే ఈ స్టార్ బౌలర్ కి ఏ మాత్రం తగ్గకుండా నజీమ్ షా, హారిస్ రౌఫ్ రఫ్ఫాడిస్తున్నారు. మరో వారంలో ఆసియా కప్ ఉండడంతో ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లు పాక్ ని ఎలా ఎదర్కొంటారో ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాటిక్ చూస్తుంటే మన బ్యాటర్లు పాక్ పేస్ త్రయాన్ని తట్టుకొని నిలబడుతుందా అనే సందేహం కలుగుతుంది.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 2 న తలబడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఉంఫ్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాక్ చేతుల్లో పరాజయం తర్వాత, గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో మ్యాచులో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్రతీకార విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. ఇక ఆసియా కప్ విషయానికి వస్తే గతేడాది చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కి భారీ హైప్ వచ్చేసింది. అయితే ఈ సమరం అంతా ఇండియన్ బ్యాటర్లకు, పాక్ బౌలర్లకు మధ్య హోరా హోరీ పోరులాగ కనిపిస్తుంది. మరి ఈ సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Pace is pace yaar💥💥🔥🔥#PakvsAfgpic.twitter.com/W4BT31b6sT
— H. (@_Ironstand) August 22, 2023