చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచం మొత్తం సాహో భారత్ అంటుంది. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో ఉన్న భారత ఆటగాళ్లు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారత రోదసి చరిత్రలో అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన ఘనతను భారత ఇస్రో అందుకుంది. చంద్రయాన్-3 ప్రయోగం దిగ్విజయం కావడంతో యావత్ భారతదేశం మొత్తం సంబురాలు చేసుకుంది. దేశం గర్వించే విధంగా ఇస్రో(ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్) విశ్వంలో కొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ద్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ తలెత్తుకుని సగర్వంగా నిలిచింది. చంద్రయాన్ చంద్రుడి ఉపరితలంపైకి చేరడాన్ని అందరూ లైవ్ లో వీక్షించారు. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో ఉన్న భారత ఆటగాళ్లు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచం మొత్తం సాహో భారత్ అంటుంది. యావత్ క్రీడా ప్రపంచం సైతం ఇస్రోకు సెల్యూట్ చేస్తోంది. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సైతం ఈ అపురూప ఘట్టాన్ని టీవీలో వీక్షించారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆనందంతో గంతులేశారు. చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఇస్రోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టలేని ఆనందంతో పరవశించిపోయారు. ఇక నిన్న జరగాల్సిన మూడో టీ 20 వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కెప్టెన్ బూమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో మన జట్టు నేడు ఈ నెల 30 న ఆసియా కప్ ఆడబోతుంది. మరి టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మీరు చూసేయండి.
🎥 Witnessing History from Dublin! 🙌
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023