సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ మీదే అందరి కన్ను. ఆసియా కప్ అయినా.. వరల్డ్ కప్ అయినా దాయాదుల మధ్య పోరుని ఎంజాయ్ చేయాలని అభిమానులు రెడీగా ఉన్నారు. ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 2 న ఇరు జట్ల మధ్య ఆసియా కప్ లో వన్డే మ్యాచ్ జరగబోతుండగా సూపర్ 4 లో మరో మ్యాచ్ ఆడనున్నారు. ఇక స్థాయికి తగ్గ ఆట కనబరిస్తే ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ పోరు చూడవచ్చు. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 14 న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీ కొనబోతున్నాయి. టాప్ ఫోర్ లో నిలిస్తే సెమి ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ కూడా చూసే అవకాశముంది. మొత్తానికి భారత్- పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి తెగ ఆసక్తి చూపించే ఫ్యాన్స్ కి 3-5 మ్యాచులు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏ జట్టు బలంగా ఉందొ ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. కానీ ఈ సారి భారత్ కంటే పాకిస్థాన్ బలంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి భారత క్రికెట్ జట్టు కొంచెం గందరగోళంగానే కనిపిస్తుంది. ఎవరూ కూడా నిలకడగా రాణించడం లేదు. దీనికి తోడు కీలక ప్లేయర్ల గాయాలు, మిడిల్ ఆర్డర్ సమస్యలు మన జట్టుని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే బూమ్రా ఆసియా కప్ లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఫామ్ లో ఉన్నా.. మరో పేసర్ షమీ చాలా నెలల తర్వాత వన్డేలాడుతున్నాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే ప్రధాన స్పిన్నర్ గా సెలక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ జట్టు పాకిస్థాన్ మీద గెలవగలుగుతారా అనే అనుమానం సగటు భారత అభిమానిలో ఉంది.
మరో వైపు పాకిస్థాన్ జట్టు యంగ్ ప్లేయర్లతో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమాముల్ హక్ ఆ జట్టుకి కొండంత బలం. ఇక బాబర్ అజాం ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వన్డేల్లో 60 యావరేజ్ తో దుమ్ము లేపుతున్నాడు. రిజవాన్, ఇఫ్తికార్, కొత్త సంచలనం అగా సల్మాన్ కూడా ఫామ్ లోనే ఉన్నారు, షాదాబ్ ఖాన్, నవాజ్ స్పిన్ బౌలింగ్ వేయడంతో పాటు బ్యాటింగ్ కూడా ఆడగలరు. చివరగా పాకిస్థాన్ పేస్ బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. షహీన్ అఫ్రిదీ, నజీమ్ షా, హారిస్ రౌఫ్ లతో భీకరంగా ఉంది. దీంతో ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరేట్ గా దిగబోతుంది.
ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకుంటే పేపర్ పై పాకిస్థాన్ జట్టే ఫేవరేట్ గా కనిపిస్తున్నా.. ఆ జట్టుకి ఏ మాత్రం అనుభవం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అందరూ దాదాపుగా కుర్రాళ్లే కావడంతో మేజర్ టోర్నీలో ఒత్తిడి తట్టుకొని వీరు నిలబడతారా? అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా వీరిలో కొంతమందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం మైనస్ గా మారనుంది. మరో వైపు టీమిండియాకు మాత్రం కావాల్సినంత అనుభవం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక్కసారి కుదురుకుంటే పాకిస్థాన్ జట్టుకి చుక్కలు చూపించగలరు. హార్దిక్ పాండ్య, జడేజా రూపంలో ఇద్దరు వరల్డ్ క్లాస్ అల్ రౌండర్లు భారత జట్టులో ఉండనే ఉన్నారు. బౌలింగ్ విషయంలో సిరాజ్ అద్భుత ఫామ్ లో ఉండగా.. బూమ్రా, షమీ ఎప్పుడైనా చెలరేగగలరు. వీరికి తోడు కుల్దీప్ యాదవ్ టాప్ ఫామ్ లో ఉండడం భారత్ కి కలిసి వచ్చే అంశం.
రికార్డుల పరంగా చూసుకున్నా టీమిండియా పై పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లోనూ మన జట్టు విజయం సాధించింది. వీటన్నిటికీ మించి స్వదేశంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగడం భారత్ కి కలిసి రానుంది. 2021, 2022 టీ -20 వరల్డ్ కప్ లో వరుసగా సెమి ఫైనల్, ఫైనల్లో పాక్ ఓడిపోవడానికి అనుభవం లేకపోవడమే కారణం. కీలక మ్యాచుల్లో రాణించాలంటే అనుభవంతో పాటు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం వరిస్తుంది. ఈ విషయంలో భారత్ తో పోలిస్తే పాకిస్థాన్ టీం చాలా వెనక పడి ఉంది. ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మినెంట్ అనే ట్యాగ్ తో పాకిస్థాన్ ని భారత్ చిత్తు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.