గత మూడు సీజన్ లుగా ఘోర ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి జట్టులో భారీ మార్పులు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ తో పాటు ఇద్దరు ఇండియన్ స్టార్ల మీద కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
సన్ రైజర్స్ జట్టులో హెడ్ కోచ్ గా సెహ్వాగ్ రాబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వినిపిస్తుంది. భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లారా స్థానంలో హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
2023 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఈ ఏడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది యాజమాన్యం.
ఇండియన్ క్రికెటర్లలో తనదైన బౌలింగ్ స్టైల్ తో ఆకటుకున్నాడు భువనేశ్వర్ కుమార్. క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపు నుంచి ఆడుతున్నాడు.
ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సీజన్ లో ధోని మీద విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంచైజీ వైపు మొగ్గు చూపిస్తున్నాడని తెలుస్తుంది.
ఐపీఎల్ 2023 లో క్లాసన్ ఫామ్ కొనసాగుతుంది. సహచర బ్యాటర్లందరూ విఫలమవుతున్నా.. తాను మాత్రం వన్ మ్యాన్ వారియర్ లాగా పోరాడుతున్నాడు. దీంతో ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ వెళ్తూ వెళ్తూ బెంగుళూరును కూడా వెంటబెట్టకెళ్లాలని చూస్తోంది. ఈ క్రమంలో తెలుగు అభిమానులు వింత కోరిక కోరుతున్నారు. తమ అభిమాన జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
ఐపీఎల్-2023లో స్టార్ టీమ్స్ ఫ్యూచర్ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతుల్లో ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ గనుక ఆ టీమ్స్‌కు షాక్ ఇచ్చిందా ఇక అంతే సంగతులు. ప్లేఆఫ్స్ టెన్షన్లో ఉన్న ఆ జట్లు ఎస్‌ఆర్‌హెచ్ గండాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నాయి.