నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు కొంతమంది బాలలు రేపటి పౌరుల్లా కాకుండా.. నేరస్తుల్లా తయారవుతున్నారు. ఒకప్పుడు టీచర్లు విద్యార్థులు అల్లరి చేసినా, సరిగా చదవకపోయినా చితక్కొట్టేసేవారు. ఇప్పుడు టీచర్ ఒక మాట అంటే చాలు, విద్యార్థులు వారిపై తిరుగుబాటు చేస్తున్నారు. టీచర్ అంటే భయం పోయింది. గౌరవం పోయింది. అరె టీచర్ ప్రాణం కూడా లెక్క లేకుండా పోతే ఇక పాఠాలు నేర్పించే టీచర్లు ఏమైపోవాలి. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పకూడదా? మందలిస్తే టీచర్ మీద పగ పెంచుకుంటారా? తప్పు చేసిన విద్యార్థులు టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తినకపోతే.. ఎదిగాక వాడు ఏ నేరస్తుడో అయ్యి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. అది తెలుసుకోలేని ఒక విద్యార్థి తనను టీచర్ తిట్టారని పగ పెంచుకున్నాడు. పగ తీర్చుకునేందుకు ఏకంగా టీచర్ నే చంపాలనుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ కి చెందిన ఓ పాఠశాల విద్యార్ధి తనకు పాఠాలు చెప్పే ప్రధానోపాధ్యాయుడిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి.. వేరే విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన హెడ్ మాస్టర్.. ఆ విద్యార్థిని మందలించారు. దీంతో సహించలేని ఆ విద్యార్థి కోపంతో రగిలిపోయాడు. నాటు తుపాకీని ఎక్కడ, ఎలా సంపాదించాడో తెలీదు గానీ టీచర్ దగ్గరకు వెళ్లి తుపాకీ గురి పెట్టాడు. తుపాకీ పట్టుకుని హెడ్ మాస్టర్ ను వెంబడించాడు. మూడు రౌండ్లు అతనిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్స్ అయిపోయాయని తెలుసుకున్న హెడ్ మాస్టర్.. ఆ విద్యార్థితో ఫైట్ చేయబోతే.. ఆ తుపాకీతో దాడి చేశాడు విద్యార్థి. ఆ తర్వాత స్థానికులు విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Sitapur, UP | A Class 12 student opened fire on school Principal with an illegal weapon & fled away. There was a dispute b/w the student & his classmate y’day which was intervened by Principal. The Principal is admitted to hospital. We’re searching the student: ASP South NP Singh pic.twitter.com/klvbUFWFHj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ బుల్లెట్లు ఉపాధ్యాయుడి శరీరంలోకి దూసుకెళ్లాయి కానీ ముఖ్యమైన అవయవాలకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, స్వల్ప గాయాలు అయ్యాయని, దీంతో మాష్టారు.. ప్రమాదం నుండి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన లక్నోలోని ఓ హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీచర్లు కొట్టే దెబ్బలు శరీరానికే గానీ మనసుకి కాదు. వారు తిట్లు ఆశీర్వాదాలే గానీ అవమానాలు కాదు. ఈ మాత్రం లాజిక్ తెలియని వాళ్ళు పెద్దయ్యాక క్రిమినల్స్ అవ్వకపోతే ఇంకేమవుతారు. కాకపోతే ఏ విద్యార్థి ఎదిగే వరకూ కూడా ఆగలేదు కనీసం. అప్పుడే క్రిమినల్ అయిపోయాడు. మరి టీచర్ మందలించాడన్న చిన్న కారణంతో నాటు తుపాకీతో కాల్పులు జరిపిన విద్యార్థిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#WATCH : पैर छूने के बहाने छात्र ने प्रिंसिपल को मारी गोली। गोली मारने का CCTV फुटेज हुआ वायरल। @sitapurpolice @Uppolice #Sitapur #CCTV #Student #Principal #UttarPradesh pic.twitter.com/VVC76eazbS
— India Voice (@indiavoicenews) September 24, 2022
Uttar Pradesh: A peeved student shot at the school headmaster in Sitapur.
Earlier, the headmaster reprimanded the student over a fight with another student. pic.twitter.com/9tYycRmDDc
— Subodh Kumar (@kumarsubodh_) September 24, 2022