ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది మైనర్లు ప్రేమలో పడుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుని బతుకుతున్నారు. లేత వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఫోన్ ఎత్తలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, పొగడలేదని ఇలా సిల్లీ రీజన్స్ కి కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తాజాగా ఒక బాలిక తనను కలవడానికి బాయ్ ఫ్రెండ్ రాలేదని పురుగుల మందు తాగింది. అయితే తనతో పాటు వచ్చిన మరో ఇద్దరు బాలికలు కూడా మందు తాగారు. వాళ్లకి బాయ్ ఫ్రెండ్స్ లేరు, కలుస్తానని చెప్పి ఎవరూ మాట తప్పలేదు. అయినా గానీ ఆత్మహత్యకు పాల్పడ్డారు? తన ఫ్రెండ్స్ ఇద్దరూ మందు తాగారని మరో బాలిక కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాకి చెందిన ఒక పాఠశాలలో ముగ్గురు బాలికలు ఒకే తరగతి చదువుతున్నారు. ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. వీరిలో ఒక బాలిక బాయ్ ఫ్రెండ్ ఇండోర్ లో ఉంటాడు. కొన్ని రోజులుగా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని.. ఆ బాలుడ్ని డైరెక్ట్ గా ఇండోర్ వెళ్లి కలవాలనుకుంది. ఈ బాలికతో పాటు ఇద్దరు స్నేహితురాళ్ళు కూడా ఇండోర్ బయలుదేరారు. శుక్రవారం ఉదయం క్లాస్ బంకు కొట్టి మరీ తాము ఉండే ప్రాంతానికి వంద కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇండోర్ వెళ్లారు. అక్కడ ఒక పార్క్ లో కలుద్దామని అనుకున్నారు. కలిపించడానికి ఒక బాలిక ఆ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడింది కూడా.
అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా కూడా బాయ్ ఫ్రెండ్ మజ్జిగ తాగుతావా? మంచి నీళ్లు తాగుతావా? అని అడగలేదు సరి కదా కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. అసలు ఆ పిల్లని కలవడానికే రాలేదట ఆ బాలుడు. వస్తానని చెప్పి ఆ మనిషి హ్యాండ్ ఇచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక చనిపోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఇంకో బాలిక కూడా తన ఇంట్లో సమస్యలు ఉన్నాయని చనిపోవాలనుకుంది. వీరితో పాటు వచ్చిన మూడో బాలిక కూడా అడ్డు చెప్పలేదు. దీంతో ముగ్గురూ సమీప దుకాణంలో పురుగుల మందు కొనుక్కుని పార్క్ లో తాగేశారు. మొదట తనను బాయ్ ఫ్రెండ్ కలవడానికి రాలేదన్న కారణంగా మొదటి బాలిక మందు తాగింది. ఇంట్లో సమస్యలు ఉన్నాయని మరో బాలిక పాయిజన్ తాగింది.
Madhya Pradesh: 3 minor girls consume poison in Indore, 2 die#MadhyPradesh #Indore #Suicide https://t.co/1oso2316Lc
— APN NEWS (@apnnewsindia) October 29, 2022
ఈ ఇద్దరినీ చూసి.. ఫ్రెండ్స్ లేకుండా నేను చేసేదేంటి అని ఆ మూడో అమ్మాయి కూడా విషం తాగింది. దీంతో ముగ్గురు బాలికలు స్పృహ కోల్పోయారు. వీళ్ళని చూసిన స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు బాలికలు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. తమకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని, మూడో బాలిక ఇచ్చిన వివరాల మేరకు స్టేట్మెంట్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.చనిపోయే ముందు ముగ్గురూ కలిసి వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియోలో చాలా సరదాగా, నవ్వుతూ వీడ్కోలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. చిన్న చిన్న కారణాల వల్ల విలువైన ప్రాణాన్ని తీసుకుని కుటుంబ సభ్యులకి గుండెకోత పెట్టొద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
हंसती खेलती ये सहेलियाँ पहले वीडियो बनाएं फिर थोड़ी देर में ज़हर खाकर ख़ुदकुशी कर दी.. मामला इंदौर का pic.twitter.com/L5Yj2t16Ra
— Priya singh (@priyarajputlive) October 29, 2022