సికింద్రాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో యావరేజ్ గా ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయో? రియల్ ఎస్టేట్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం.
రియల్ ఎస్టేట్ అనేది ఆయా ఏరియాలను బట్టి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. మహా నగరాల్లో కొన్ని ఏరియాలు తప్పితే దాదాపు అన్ని ఏరియాలు రియల్ ఎస్టేట్ పరంగా టాప్ లో ఉంటాయి. హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు సగటున ఎలా ఉన్నాయో? రియల్ ఎస్టేట్ ఎలా ఉందో అనే విషయాలను ఇది వరకే వెబ్ సైట్ లో ఇవ్వబడింది. సికింద్రాబాద్ లో ల్యాండ్ రేట్లు కూడా ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనే విషయంపై కూడా ఒక కథనం ఐతే ఇచ్చాము. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ లోని పలు ఏరియాల్లో ఫ్లాట్ ధరలు సగటున ఎలా ఉన్నాయి? ఏ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగుంది? ఎక్కడ రియల్ ఎస్టేట్ బాలేదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ లోని గడిచిన ఏడాదిలో కౌకుర్, మేడ్చల్, ఓల్డ్ బోయినపల్లి, కొంపల్లి, వెస్ట్ మారేడ్పల్లి ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఈ ఏరియాల్లో సగటున ఫ్లాట్ ధరలు చదరపు అడుగుకి రూ. 4,200 నుంచి రూ. 6,050 మధ్యలో ఉన్నాయి. కౌకుర్ లో చదరపు అడుగు రూ. 4,500, ఓల్డ్ బోయినపల్లిలో రూ. 4,200, కొంపల్లిలో రూ. 5,250, వెస్ట్ మారేడ్పల్లిలో రూ. 6,050 వద్ద ఫ్లాట్ ధరలు ఉన్నాయి. ఒక 1 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే 600 చదరపు అడుగులకు రూ. 25 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకూ అవుతుంది. 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఐతే కనీసం 1000 చదరపు అడుగులకు రూ. 42 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకూ అవుతుంది. మేడ్చల్ లో అయితే రియల్ ఎస్టేట్ ఏడాదిలో 20 శాతం పెరిగింది. ఇక్కడ చదరపు అడుగు సగటున రూ. 3 వేలుగా ఉంది. 20 లక్షల్లో 1 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది దొరకచ్చు. 30 లక్షల్లో 2 1 బీహెచ్‌కే దొరికే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ ధరలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. మీ అవగాహన కోసం ఇవ్వబడిన కథనం మాత్రమే. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. అసలు ధరల కోసం స్థానిక యజమానులను, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను సంప్రదించవలసినదిగా మనవి.