హైదరాబాద్ శివారులోని రూ. 12 లక్షలకే 1 బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతుంది. సెంట్రల్ హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఈ ఏరియాలో సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు సరిపోయే ఫ్లాట్ రూ. 12 లక్షల నుంచి వస్తుంది.
ఏ నగరం అయినా నాలుగు దిక్కులు, ఒక కేంద్రం అనేది సహజం. హైదరాబాద్ కి కూడా 4 దిక్కులు, ఒక కేంద్రం ఉన్నాయి. అవే వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్. ఈ ఏరియాల్లో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ లో 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 30 లక్షలు పెట్టుకోవాలి. ఇంతకంటే తక్కువ ధరకు దొరుకుతాయి కానీ పాతవి ఉంటాయి. లేదా స్థలం బాగా తక్కువ ఉంటుంది. స్థలం కొంచెం పెద్దగా ఉండి కొత్తవి కావాలంటే రూ. 30 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వెస్ట్ హైదరాబాద్ లోని ఓ ఏరియాలో మాత్రం 1 బీహెచ్కే ఫ్లాట్ సామాన్యుడికి సరిపోయే విధంగా ఉన్న ఫ్లాట్ రూ. 12 లక్షలకే దొరుకుతుంది.
రియల్ ఎస్టేట్ కంపెనీలు డేటా ప్రకారం సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు 1 బీహెచ్కే ఫ్లాట్ అంటే కనీసం 400 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల వరకూ సరిపోద్ది. ఈ లెక్కన 400 చదరపు అడుగుల్లో ఫ్లాట్ కావాలి అనుకుంటే గనుక వెస్ట్ హైదరాబాద్ లోని శంకర్ పల్లిలో చదరపు అడుగుకి రూ. 3,050 చొప్పున కనీసం రూ. 12,20,000 అవుతుంది. 600 చదరపు అడుగుల్లో కావాలనుకుంటే రూ. 18,30,000 అవుతుంది. బాగా విశాలంగా ఉండాలనుకుంటే రూ. 41 లక్షల వరకూ అవుతుంది. వెస్ట్ హైదరాబాద్ లో అత్యధిక ధర కలిగిన ఏరియాగా శిల్ప హిల్స్ ఉంది. ఈ ఏరియాలో చదరపు అడుగు రూ. 12,100 ఉంది. ఈ ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే 400 చదరపు అడుగులకు రూ. 48,40,000 ఖర్చవుతుంది. లగ్జరీగా కావాలనుకుంటే రూ. కోటి 63 లక్షల పైనే అవుతుంది.
గమనిక: ఇవి సగటు ధరలు మాత్రమే. ఈ రేంజ్ నుంచి మొదలవుతాయి. ఇంతకంటే ఎక్కువ ధరలు కలిగిన ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అయితే ఏరియాల్లోని లొకాలిటీస్ బట్టి హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఈ రేట్లు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేము. అవగాహన కోసం ఇవ్వబడిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. అసలు ధరల కోసం స్థానిక ఏరియా ఏజెంట్లను గానీ, స్థల యజమానులను గానీ సంప్రదించవలసినదిగా మనవి. ల్యాండ్ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయని గమనించగలరు.