హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ ఏరియాలో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి? రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ ఉందని, దూసుకుపోతోందని అంటారు. కానీ అన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అలా నడవదు. కొన్ని ఏరియాల్లో యాక్టివ్ గా ఉంటే.. కొన్ని ఏరియాల్లో స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది. ఎప్పుడు లేస్తుందో తెలియదు గానీ పడుకుని ఉంటుంది. అలాంటి ఏరియాలు హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ లో ఉన్నాయి. ఈస్ట్ జోన్ లోని కొన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్ లో ఉంటే.. మరికొన్ని ఏరియాల్లో మాత్రం చాలా డల్ గా ఉంది. మీరు ఈస్ట్ జోన్ లో ఫ్లాట్ల మీద పెట్టుబడి పెట్టాలి అనుకుంటే గనుక రియల్ ఎస్టేట్ ఏ ఏరియాలో బాగుందో అనేది పరిశీలించుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంది, ఎక్కడ బాలేదు అనే వివరాలు మీ కోసం.
ఇవే హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ ఏరియాల్లో ఉన్న ఫ్లాట్ల సగటు ధరలు, వాటి వృద్ధి రేట్లు. పదేళ్లు, ఐదేళ్లు, మూడేళ్లు, ఏడాది కాలంలో ఏ ఏరియా ఎంత వృద్ధి రేటు సాధించింది? ఎంత వెనుకబడింది? అనే విషయంపై మీకు ఒక స్పష్టత వచ్చే ఉంటుంది.కొన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది బాగుంటే.. మరి కొన్ని ఏరియాల్లో డల్ గా ఉంది. గడిచిన ఏడాదిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉందనేది చూసుకుంటే.. కాచిగూడ, రామాంతపూర్, బోడుప్పల్, అల్కాపురి, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, ఘట్కేసర్, మలక్ పేట్ వంటి ప్రాంతాలు టాప్ లో ఉన్నాయి. మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే గనుక ఈ ఏరియాలు ఉత్తమం అని చెప్పవచ్చు.
గమనిక: పైన తెలుపబడిన ఫ్లాట్ ధరలు సగటు ధరలు మాత్రమే. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం ఇవ్వబడింది. అసలైన ధరల కోసం స్థానిక రియల్ ఎస్టేట్ ఏజెంట్లను, యజమానులు సంప్రదించవలసినదిగా మనవి.