హైదరాబాద్ లోని సౌత్ జోన్, సెంట్రల్ ఏరియాలో ఫ్లాట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఏ ఏరియాలో ఫ్లాట్ కొంటే ఫ్యూచర్ ఉంటుంది?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. నిజమే కానీ అన్ని ఏరియాల్లోనూ కాదు. కొన్ని ఏరియాల్లో మాత్రమే. కొన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ రాకెట్ లా దూసుకుపోతుంటే.. కొన్ని చోట్ల మాత్రం నత్తనడకన నడుస్తోంది. అలాంటి ఏరియాలు ఏమిటో తెలుసుకుని.. వాటి గత కొన్ని నెలలు, సంవత్సరాల వృద్ధి రేటు పరిశీలించి పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాలి. లేదంటే నష్టపోకతప్పదు. హైదరాబాద్ లోని సౌత్, సెంట్రల్ జోన్స్ లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలు ఉన్నాయి. అలానే రియల్ ఎస్టేట్ డల్ గా ఉన్న ఏరియాలూ ఉన్నాయి. మరి హైదరాబాద్ సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంది, ఎక్కడ బాలేదు అనే వివరాలు మీ కోసం.
ఇవే హైదరాబాద్ లోని సౌత్, సెంట్రల్ జోన్ ఏరియాల్లో ఉన్న ఫ్లాట్ల సగటు ధరలు, వాటి వృద్ధి రేట్లు. గత పదేళ్లుగా ఎంత వృద్ధి రేటు ఉంది, ఐదేళ్లుగా, మూడేళ్లుగా, ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ పరంగా ఏ ఏరియా ఎంత వృద్ధి చెందింది? ఏ ఏరియాలో రియల్ ఎస్టేట్ ప్రతికూలంగా ఉంది? అనే విషయాల పట్ల ఒక స్పష్టత వచ్చే ఉంటుంది. కొన్ని ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది బాగుంది. మరి కొన్ని ఏరియాల్లో మాత్రం బాలేదు. గడిచిన ఏడాదిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉందనేది చూసుకుంటే.. సౌత్ జోన్ ఏరియాల్లో బండ్లగూడ జాగీర్, శంషాబాద్, అత్తాపూర్, ఆదిభట్ల, తుక్కుగూడ ప్రాంతాల్లో వృద్ధి రేటు అనేది బాగుంది. సెంట్రల్ జోన్ ఏరియాల్లో ఐతే గడిచిన ఏడాది కాలంలో మోతీనగర్, షేక్ పేట్, ఎల్లారెడ్డిగూడ, టోలిచౌకి, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్ ఏరియాల్లో వృద్ధి రేటు అనేది బాగుంది.
గమనిక: పైన తెలుపబడిన ఫ్లాట్ ధరలు సగటు ధరలు మాత్రమే. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం ఇవ్వబడింది. అసలైన ధరల కోసం స్థానిక రియల్ ఎస్టేట్ ఏజెంట్లను, యజమానులు సంప్రదించవలసినదిగా మనవి.