సికింద్రాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.
జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఓ రేంజ్ లో ఉంది. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలం కొనాలంటే కనీసం రూ. 40 లక్షలైనా పెట్టుకోవాలి. 150 గజాల స్థలానికి అయితే కనీసం రూ. 40 లక్షలు అవుతుంది. ఇంతకన్నా తక్కువ ఉండచ్చు. ఏరియాను బట్టి తగ్గచ్చు. సికింద్రాబాద్ లోని ఏ ఏరియాలో ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ఏరియాల్లో తక్కువగా ఉన్నాయి? ఏ ఏరియాల్లో ల్యాండ్ కొంటే లాభం ఉంటుంది? ఇల్లు కడితే రెంట్లు బాగా వచ్చే ఏరియాలు ఏమిటి? గడిచిన ఏడాదిలో ల్యాండ్ ధరలు ఎంత శాతం పెరిగాయి? అనే వివరాలు మీ కోసం.
గమనిక: అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ధరలు ఇవ్వబడినవి. ఈ ధరలు కేవలం సగటు ధరలు మాత్రమే. ప్రారంభ ధరలు ఆ రేంజ్ నుంచి మొదలై ఇంకా ఎక్కువగా ఉంటాయి. మీకు అవగాహన రావడం కోసం ఇవ్వబడింది. అసలు ధరల కోసం స్థానిక ఏరియా ఏజెంట్లను గానీ, స్థల యజమానులను గానీ సంప్రదించవలసినదిగా మనవి. ల్యాండ్ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయని గమనించగలరు.