సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి కల నెరవేరే ముందు తొందరపాటు అస్సలు తగదు. ఇంటి స్థలం కొంటున్నా, లేదా ప్లాటును కొనుగొలు చేస్తున్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మీ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఇంటి స్థలం కొనే ముందు మొదట అమ్మే వ్యక్తికి ఉన్న హక్కు పత్రాలు చూడాలి. టైటిల్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్లను పరిశీలించాలి. వాళ్లు ఏ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారనే వివరాలూ ఉంటాయి. ఆ లింక్ డాక్యుమెంట్లనూ పరిశీలించాలి.
ప్రధానంగా రియల్ ఎస్టేట్ మోసాల్లో ఎక్కువగా జరిగేది.. ఒకే ప్రాపర్టీని ఇద్దరు, ముగ్గురికి అమ్మడం. డ్యూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తుంటారు. అందుకే మీరు కొనుగోలు చేసే ఇల్లు, ఇంటి స్థలం, పొలాలు మొదలైనవి కొనేసమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దళారుల చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఏయే విషయాలు తెలుసుకోవాలి?. లిటిగేషన్ ప్రాపర్టీ అంటే ఏమిటి? ఎండార్సుమెంట్ సర్టిఫికెట్ అంటే ఏంటి? ఎండార్సుమెంట్ సర్టిఫికెట్ తీసుకుంటే.. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయా? వంటి మరెన్నో వివరాల కోసం ఈ వీడియో చూసేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.