డెవలప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఏరియాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆర్థికంగా ఎదిగే అవకాశం మీ కోసమే. డెవలప్ అవ్వడానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది అని నిరుత్సాహపడకండి. ఎందుకంటే రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే సంవత్సరాలు స్పీడ్ గా వెళ్లిపోతున్నాయి. కాబట్టి ఒక మూడు, నాలుగేళ్లు పెట్టుబడి పెట్టేసి వదిలేస్తే ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 400 కి.మీ.లకు విస్తరించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ. 69 వేల కోట్లను వెచ్చించనున్నారు. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అందుబాటులో ఉండగా.. టెండర్ల దశలో ఉన్న ఎయిర్ పోర్ట్ మెట్రో కలిపితే 105 కిలోమీటర్లు అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో కారిడార్ రానుంది.
జేబీఎస్ నుంచి తుంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ, ఇస్నాపూర్ నుంచి మియాపూర్, మియాపూర్ నుంచి లక్డీకపూల్, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట, ఉప్పల్ నుంచి బీబీ నగర్, తార్నాక నుంచి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, ఎయిర్ పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ), శంషాబాద్ మీదుగా షాద్ నగర్ కి మెట్రో కారిడార్ రానుంది. అలానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తరహాలో మరో విమానాశ్రయ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హకీంపేటలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అధిక లాభాలను పొందవచ్చు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేస్ 3 విస్తరణలో భాగంగా మొత్తం 6 మెట్రో ఎక్స్ టెన్షన్ కారిడార్లు, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలు, ఎలివేటెడ్ 2 లెవల్ కారిడార్లు మూడు దశల్లో పూర్తి చేయనున్నారు.
జేబీఎస్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, మియాపూర్, లక్డీకపూల్, ఉప్పల్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ సహా సిటీలో ఉన్న ప్రాంతాలు మినహాయించి మిగతా ఏరియాల్లో కనుక ల్యాండ్ కొనుక్కుంటే మంచి లాభాలు ఉంటాయి. బీబీనగర్ లో చదరపు అడుగు సగటున రూ. 1350 ఉంది. కందుకూరులో సగటున రూ. 1600 ఉంటే.. తుంకుంటలో చదరపు అడుగు సగటున రూ. 2600 పలుకుతోంది. కండ్లకోయలో సగటున చదరపు అడుగు రూ. 2300 ఉంటే.. ఇస్నాపూర్ లో రూ. 3600 ఉంది. హకీంపేట్ లో రూ. 2800 ఉంది. తుక్కుగూడలో రూ. 2200, ఘట్కేసర్ లో రూ. 2000, మహేశ్వరంలో రూ. 1550 ఉంది. కొత్తూరులో సగటున చదరపు అడుగు స్థలం రూ. 1900 ఉంది. షాద్ నగర్ లో సగటున రూ. 1500 ఉంది. మూడు నుంచి అయిదేళ్లలో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఈ మూడేళ్ళలో అక్కడ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి.
ఇప్పుడు కొనుగోలు చేస్తే కనుక గజాల లెక్కన కొనగలుగుతారు. అదే డెవలప్ అయ్యాక కొనాలంటే చదరపు అడుగుల్లో కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ వస్తున్న ఈ ఏరియాల్లో ప్రస్తుతం గజం రూ. 12 వేల నుంచి రూ. 32 వేల వరకూ ఉంది. లొకేషన్స్ బట్టి ఈ రేట్లు తగ్గచ్చు, పెరగొచ్చు. హైదరాబాద్ సిటీలో మెట్రో రైలు పడిన ఏరియాల్లో గజం కనీసం రూ. లక్ష ఉంది. ఈ లెక్కన కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్ట్ వస్తే ఆ ఏరియాల్లో రేట్లు ఎంతగా పెరిగిపోతాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భూమి మీద ఇప్పుడు ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం 3 నుంచి 5 ఏళ్ళు పడుతుందని చెబుతుంది కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడు, నాలుగేళ్లలోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.