ఏపీలో ల్యాండ్ కొంటే భవిష్యత్తులో భారీ లాభాలు రావాలని కోరుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఆ ఏరియాలు ఏంటో చూసేయండి.
ఏపీని కూడా గోవా తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఏపీలోని 12 కోస్తా జిల్లాల్లో గోవా తరహాలో 289 తీర ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోస్టల్ జోన్ టూరిజం మాస్టర్ ప్లాన్ ను ప్రారంభించింది. జాయింట్ బృందాలు ఇప్పటికే సర్వేలు నిర్వహించి నివేదికలను జిల్లా కలెక్టర్లకు పంపించారు. ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ కోస్టల్ జోన్ టూరిజం మాస్టర్ ప్లాన్.. భాగంగా 12 జిల్లాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో పర్యాటక రంగం విషయంలో ఏపీ గోవాకి గట్టిపోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ మాస్టర్ ప్లాన్ ను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇది తీర ప్రాంతాల్లో అభివృద్ధి పెరగడానికి మరియు పర్యాటకులను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. కోస్టల్ జోన్ టూరిజం మాస్టర్ ప్లాన్ లో ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో ప్రధాన అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 60 సంభావ్య తీర ప్రాంతాలను సర్వే బృందాలు గుర్తించాయి. నెల్లూరు జిల్లా 40 బీచ్ స్పాట్ లు, బాపట్ల జిల్లా సుమారు 28 తీర ప్రాంతాలు, విశాఖపట్నం 24 పొటెన్షియల్ బీచ్ లను కలిగి ఉన్నాయి. టూరిజం సెక్టార్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 117 ఎంవోయుల మీద సంతకం చేసిన విషయం తెలిసిందే.
టూరిజం సెక్టార్ లో రూ. 19,345 కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా.. ఇప్పటికే 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.. ఈ ఎంవోయులు కనుక రియాలిటీలోకి వస్తే తీర ప్రాంతాల్లో 51 వేల ఉద్యోగాలు వస్తాయి. రిసార్టులు, రిక్రియేషన్ ఫెసిలిటీస్ తో బీచ్ లను డిజైన్ మరియు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ డెవలపర్స్ ని ప్రోత్సహిస్తోంది. ఐదు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు రాబోతున్నాయి. గండికోట, హార్స్లీ హిల్స్, పిచ్చుక లంక సహా ఐదు ప్రత్యేక టూరిస్ట్ ప్రాంతాల్లో ఒబెరాయ్ గ్రూప్ ఫైవ్ స్టార్ హోటల్స్ ని నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. ఆర్థిక పరమైన వృద్ధి, ప్రపంచ నలుమూలలా ఉన్న టూరిస్టులను ఆకర్షించే డెస్టినేషన్ ను ఏర్పాటు చేయడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుంది.
రాబోయే రోజుల్లో శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలే కాకుండా మిగతా కోస్తా జిల్లాలు కూడా గోవా తరహాలో అభివృద్ధి చెందనున్నాయి. కోస్టల్ జోన్ టూరిజం మాస్టర్ ప్లాన్ రియాలిటీలోకి వస్తే కనుక ఏపీలోని 12 జిల్లాలు టూరిజం సెక్టార్ లో బాగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ల్యాండ్ ధరలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొనుక్కుని ఉంచుకుంటే రానున్న రోజుల్లో ల్యాండ్ విలువ విపరీతంగా పెరిగిపోతుంది. రెస్టారెంట్లు, రిసార్టులు వంటి కమర్షియల్ హంగులతో తీర ప్రాంతాలన్నీ కళకళలాడిపోతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే తీర ప్రాంతాలు మాత్రమే కాదు.. ఆ జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి. అప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వారికి రాబోయే రోజుల్లో మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.