బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గొడవలు, గ్రూపులు, కొట్లాటలు, టాస్కులతో తెగ హడావుడిగా మారిపోయింది. కెప్టెన్సీ టాస్కుతో హౌస్ మేట్స్ అంతా ఫుల్ బిజీగా మారిపోయారు. కెప్టెన్సీ టాస్కులో మొదటి రౌండ్ పూర్తైన విషయం తెలిసిందే. తర్వాత శ్రీహాన్- ఆదిరెడ్డి- శ్రీ సత్య రెండో రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు. ఎత్తరజెండా టాస్కులో ఆదిరెడ్డి విజయం సాధించాడు. అంతేకాకుండా భావోద్వేగానికి కూడా లోనయ్యాడు. శ్రీ సత్యకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లభించినా కూడా స్టామినా విషయంలో శ్రీహాన్, ఆదిరెడ్డిని బీట్ చేయలేకపోయింది. గేమ్, టాస్కులు ఆడినా ఆడకపోయిన ఒక విషయంలో మాత్రం శ్రీ సత్య పేరు ప్రేక్షకుల్లో హౌస్‌లో నానుతూనే ఉంటుంది.
అవును లవ్ ట్రాక్ అనే కాన్సెప్ట్ విషయంలో శ్రీ సత్య పేరు హౌస్ మొత్తం రీసౌండ్ వస్తూనే ఉంటుంది. అయితే అర్జున్ కల్యాణ్‌కి ఆమె అంటే ఇష్టంఉంది అని అందరికీ తెలుసు. లేస్తే అర్జున్ శ్రీ సత్య చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నాగార్జున కూడా ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమే కదా అంటూ కామెంట్ చేశాడు. అయితే శ్రీ సత్య మాత్రం హౌస్‌లో ఎవరూ నా నుంచి రిలేషన్ వంటివి కోరుకోకండి, నేను కేవలం డబ్బు కోసమే వచ్చాను.. నాకు మనీ- ఫేమ్ మాత్రం చాలు అంటూ కుండ బద్దలు కొట్టింది. కానీ, అర్జున్ మాత్రం తన ప్రయత్నాలు విరమించుకున్నట్లు కనిపించడం లేదు. అన్నయ్యా అని పిలిచిన తర్వాత కూడా అర్జున్ కల్యాణ్.. శ్రీ సత్య చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాడు.
వీళ్లిద్దరి విషయంలో ఇంట్లోని సభ్యులకు సైతం అనుమానం, ప్రశ్నలు ఉన్నాయి. అదే విషయాన్ని నేహా- శ్రీహాన్‌తో మాట్లాడింది. సాయంత్రం పూల్ పక్కన కూర్చున్న శ్రీహాన్‌తో నేహా చౌదరి మాట కలిపింది. ఎదురుగా ఉన్న శ్రీ సత్య- అర్జున్ కల్యాణ్‌లను చూస్తూ అసలు వారి మధ్య ఏముంది? ఆమె ఏం చెప్పినా వాహ్వా వాహ్వా అంటూ ఉంటాడు.. నువ్వు నాకు నిజంయ చెప్పు అని అడగ్గా.. శ్రీహాన్ అసలు విషయం బయట పెట్టాడు. అర్జున్‌కి శ్రీ సత్యపై ఫీలింగ్స్ ఉన్నాయి. ఆమె మాత్రం వాడిని దేకడం లేదు. పైగా అన్నయ్య అని పిలుస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు నేహా నోరెళ్లబెట్టింది. అదేంటి అన్నయ్యా అని పిలవడం ఏంటని. అయితే అర్జున్ ఎన్నిసార్లు ఖండించినా అతనికి శ్రీ సత్యపై ఫీలింగ్స్ ఉన్న మాట వాస్తవమే అని శ్రీహాన్ క్లారిటీ ఇచ్చాడు. అర్జున్‌ని శ్రీ సత్య అన్నయ్య అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.