బిగ్ బాస్ రీసెంట్ సీజన్ తో బాగా పాపులర్ అయిన లేడీ కంటెస్టెంట్ శ్రీసత్య. సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన ఈ భామ.. షోలో తన గ్లామర్ చూపించింది. అందంతో కుర్రాళ్లని కట్టిపడేసింది. అయితే ఈమెని అర్జున్ కల్యాణ్ తెగ అభిమానించేవాడు. కానీ శ్రీసత్య మాత్రం అస్సలు పట్టించుకునేది కాదు. అలా అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీహాన్ తో కనిపించేది. అలా చివరి వరకు హౌసులో ఉన్న శ్రీ సత్య బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ‘బీబీ జోడీ’ డ్యాన్స్ షోలోనూ వన్ ఆఫ్ ది జోడీలో ఉంది.
ఇక విషయానికొస్తే.. బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు పాల్గొన్న పలువురిని జోడీలుగా చేసి ఈ డ్యాన్స్ షోని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో శ్రీసత్య-మెహబూబ్ జంట కాగా, అర్జున్-వాసంతి ఓ జోడీగా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. చాలా వారాల క్రితమే ప్రారంభమైన ఈ షోలోకి రీసెంట్ గానే శ్రీసత్య ఎంట్రీ ఇచ్చింది. తన స్టెప్పులతో దుమ్మురేపుతోంది. ప్రతి ఆదివారం వచ్చే ఈ షోలో ఇప్పటివరకు 11 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇక ప్రొఫెనషల్ డ్యాన్సర్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా వీళ్లందరూ అదరగొడుతున్నారు.
అయితే బాగా డ్యాన్స్ చేయడం కోసం వీళ్లందరూ కూడా ఎప్పటికప్పుడూ ప్రాక్టీసు చేస్తూనే ఉంటారు. అలా ఒకేచోట అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. కొంతసేపటివరకు అంత బాగానే జరిగింది. కానీ ప్రాక్టీసు చేసే ప్లేస్ కోసం సడన్ గా మెహబూబ్-అర్జున్ గొడవపడ్డారు. దీంతో అక్కడే ఉన్న శ్రీసత్య.. వాళ్లిద్దరినీ వారించే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కూడా మాట వినకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూసింది. దీంతో చివరగా షాకిచ్చిన మెహబూబ్… ఇదంతా ప్రాంక్ అంటూ చల్లగా చెప్పుకొచ్చాడు. దీంతో షాకవడం శ్రీసత్య వంతైంది. ఇక ఈ వీడియోకి నెటిజన్స్.. పాజిటివ్-నెగిటివ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.