బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి మంచి ఫేమ్ ను , నేమ్ ను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో వారే శ్రీసత్య, మెహబూబ్ లు. ప్రస్తుతం వీరిద్దరూ బీబీ జోడిలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా శ్రీ సత్యకు ప్రపోజ్ చేశాడు మెహబూబ్.
ప్రముఖ తెలుగు టీవి ఛానల్లో ప్రసారమయ్యే రియాలిటీ షోల్లో తొలి వరుసలో ఉంటుంది బిగ్ బాస్. ఏడాదికొక సీజన్ తో అలరించే ఈ షో టిఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంటుంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లను ముగిసిపోయాయి. అంతక ముందు సరిగ్గా పేరు కూడా తెలియని వాళ్లు.. ఈ షోలో పాల్గొని ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ హౌస్ నుండి బయటకు వచ్చాక పలువురికి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. పేరుతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఈ రియాలిటీ షో. గతంలో యూట్యూబర్స్ సిరి, షణ్ముఖ్ ఈ షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాని వల్ల షణ్ముఖ్ కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పగా.. సిరి, శ్రీహాన్ ఆల్ మోస్ట్ విడిపోయి.. తర్వాత కలుసుకున్నారు.
ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో కూడా పలు లవ్ ట్రాక్లు నడిచాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిందీ శ్రీ సత్య-అర్జున్ కళ్యాణ్. వీరి లవ్ చివరికీ ట్రాజెడీగా మారినా.. దాని కారణం శ్రీసత్యనేనని చూసిన వారు తిట్టి పోశారు. ప్రస్తుతం బీబీ జోడి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు శ్రీసత్య. మెహబూబ్ కు జోడీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుంది. అయితే వాలంటైన్స్ డే పురస్కరించుకుని మెహబూబా.. శ్రీ సత్యకు ప్రపోజ్ చేసేశాడు. ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నానని, ఆ అమ్మాయి రిజక్ట్ చేస్తే తట్టుకోలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పిన మెహబూబ్.. నాన్చి నాచ్చి చివరకూ శ్రీ సత్యకు ‘నువ్వంటే చాలా ఇష్టం సత్య’అంటూ ఓ ఫ్లవర్ బొకేను ఇచ్చి ప్రపోజ్ చేశాడు. దీనికి అల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో పెంటయ్యింది. ఇప్పుడు అయ్యిద్దీ అంటూ సీరియస్ అయింది.
మెహబూబ్ చేయి కోసుకుంటానని అనే సరికి.. అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్లు సంకేత్, ప్రియాంక, శ్రీసత్య కంగారు పడ్డారు. చేయి కోసుకోవడం ఏంటంటని గట్టిగానే ప్రశ్నించింది. దీనికి మెహబూబ్ ఎవ్వరీ ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేయవా అని అడిగితే.. జీవితంలో ఎవ్వరినీ ప్రేమించకూడదని భావించానని చెప్పారు. నీ లైఫ్ గురించి తనకు తెలుసునని అందుకే నువ్వంటే ఇష్టమంటూ మెహబూబ్ ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. తన ఫాస్ట్ ని ఎవ్వరూ తీసుకోలేరని, ఎవ్వరినీ నా జీవితంలోకి ఆహ్వానించడం లేదని అన్నారు. బిగ్ బాస్ లో కూడా జరిగిన విషయాన్నికూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన శ్రీ సత్య.. అందరూ ప్రపోజ్ చేస్తున్నారంటూ అసహనానికి గురైంది. తనకు ఫాస్ట్ ఉందని, నీతో జీవితాన్ని ఇవ్వాలని ఈ ప్రతిపాదన చేసినట్లు మెహబూబ్ చెప్పాడు
గతంలో ఒకరు కొడితే, రక్తం కూడా వచ్చిందని మెహబూబ్ అనగా.. తాను ఏకంగా సూసైడ్ చేసుకున్నట్లు శ్రీ సత్య చెప్పింది. నా లైఫ్ అంతా పెంటయ్యిందని, ఇదంతా చూసి తన లైఫ్ లో ఇంకెవరని రానివ్వను అని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే ఎవ్వరనీ పెళ్లి చేసుకోవగా అనగా.. చేసుకోనని చెప్పేసింది. దీంతో అతడూ అసలు విషయాన్ని బయట పెట్టేశాడు. రెండు నెలల నుండి తన శ్రీ సత్య గురించి అన్నీ తెలుసునన్న మెహబూబ్ ఎలా ప్రపోజ్ చేస్తానంటూ ఆమెకే ట్విస్ట్ ఇచ్చాడు. ఇదంతా ఫ్రాంక్ అని తెలిసే సరికీ.. మెహబూబ్ పై శ్రీ సత్య సీరియస్ అయింది. ఎలా వస్తాయయ్యా నీకు ఇటువంటి ఐడియాలు అంటూ మండిపడింది. చివరకు మరో ట్విస్ట్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మెహబూబ్ చేసిన ఈ ఫ్రాంక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.