వాసంతి కృష్ణన్.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ హౌజ్ లో కాస్త పద్దతిగా కనిపించిన వాసంతి.. తనలోని బోల్డ్ లుక్ ను తాజాగా టాలీవుడ్ కు పరిచయం చేసింది.
‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను గత ఆరు సీజన్లుగా అరిస్తోన్న షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. వీరిలో కొంత మంది ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ హౌజ్ లో తన అందం, అభినయంతో అభిమానులను ఫిదా చేసింది. ఇక తర్వలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో రెచ్చిపోయింది వాసంతి. లిప్ లాక్ లతో, హాట్ హాట్ రొమాంటిక్ ఫోజులతో తనను ఎప్పుడూ చూడని యాంగిల్ లో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.
వాసంతి కృష్ణన్.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ హౌజ్ లో కాస్త పద్దతిగా కనిపించిన వాసంతి.. తనలోని బోల్డ్ లుక్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇక వాసంతి త్వరలోనే వెండితెరపై కనిపించనుంది. ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. విశ్వక్ సేన్ ఫ్రెండ్ గీతానంద్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైయ్యాడు విశ్వక్ సేన్. ఇక గేమ్ ఆన్ టీజర్ లో తన బోల్డ్ నెస్ ను చూపించింది వాసంతి.
ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ కాగా వాసంతి కృష్ణన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టీజర్ లో వాసంతి సీన్స్ చూస్తుంటే.. ఇంతకు ముందు ఎన్నడూ కూడా నటించని విధంగా తన హాట్ నెస్ ను చూపించింది. లిప్ లాక్ లతో రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది. కైపెక్కించే చూపులతో.. కుర్రకారుకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. హీరో గీతానంద్ తమ్ముడు దయానంద్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. గేమ్ ఆన్ లో మూవీలో అలనాటి తార మధుబాల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మరి వాసంతి కృష్ణన్ బోల్డ్ ట్రీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.