బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం నుంచి హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. కెప్టెన్సీ టాస్కుతో హౌస్‌లో అంతా రచ్చ రచ్చ జరుగుతోంది. అడవిలో ఆట టాస్కుతో కొత్త గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. గీతూ రాయల్ కొత్తగా సూర్య- శ్రీహాన్‌తో కనెక్షన్ వచ్చిదంటూ కామెంట్ చేసింది. అలాగే గొడవలు కూడా అలాగే అయ్యాయి. ఇనయాకి రేవంత్- శ్రీహాన్‌తో ఒక పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. వాడు అంటావా అంటూ రేవంత్- శ్రీహాన్ ఆమెతో గొడవకు దిగారు. ఆ విషయంపై ఆమెక సారీ కూడా చెప్పింది. ఇప్పుడు మరోసారి శ్రీహాన్‌తో ఇనయా గొడవకు దిగింది. ఈసారి గొడవ కూడా చాలా పెద్దగానే జరిగింది. నన్ను అంత మాట అంటావా అంటూ ఇనయా సుల్తానా ఇల్లు పీకి పందిరేసింది.
అసలు ఏం జరిగిందంటే.. అడవిలో ఆట టాస్కులో నెగ్గి ఆదిరెడ్డి, ఫైమా, గీతూ, శ్రీ సత్య, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారికి పోటీని రెండు రౌండ్లలో నిర్వహించారు. మొదటి రౌండ్లో పిరమిడ్ టాస్కు ఇచ్చారు. ఆ టాస్కులో ఐదుగురు కట్టిన పిరమిడ్లను ఇంట్లోని సభ్యులు పడగొట్టాలి. ఆ క్రమంలో ఫైమా బ్రిక్‌ని చేత్తో పట్టుకుని ఆపింది అని సంచాలక్ రేవంత్ ఫైమాని డిస్కాలిఫై చేశాడు. ఆ మాట వినగానే ఇనయా సుల్తానా వచ్చి శ్రీహాన్ కూడా చేత్తో పట్టుకున్నాడు అంటూ రేవంత్‌కి ఫిర్యాదు చేసింది. ఆ మాట విన్న శ్రీహాన్ నేను పట్టుకోలేదని, ఆమె కావాలనే అలా చెప్తోంది అంటూ సీరియస్ అయ్యాడు. రేవంత్‌తో ఏ పిట్ట కూతలు నువ్వు పట్టించుకోకు అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ మాటకు ఇనయా సుల్తానా ఉగ్రరూపం దాల్చింది. నన్ను పిట్ట అని ఎలా అంటావ్ అంటూ కేకలు వేసింది. ఇనయా అరుపులకు శ్రీహాన్ అక్కడి నుంచి పారిపోయాడు. అయినా వెనకే ఇంట్లోకి వెళ్లి పిట్ట అని ఎలా అంటావ్ చెప్పు అంటూ గోల చేసింది. వాడు అంటే తీసుకోని వాడివి నన్ను పిట్ట అని ఎలా అంటావ్? మగాడిలా బిహేవ్ చేయి. పిట్ట కూతలు అని నా గొంతు గురించి మాట్లాడావ్. నన్ను బాడీషేమింగ్ చేశావ్ అంటూ ఇనయా సుల్తానా రచ్చ రచ్చ చేసింది. మధ్యలో గీతూ రాయల్ వచ్చి ఆ పిట్ట నేనే.. నిన్ను ఎవరు పిట్టా అంటారు? అంటూ కామెంట్ చేసింది. ఇంత గ్లామర్‌గా ఉన్న నన్ను పిట్ట అంటారు కానీ, నిన్ను ఎవరైనా అంటారా? అంటూ గోల చేసింది. వచ్చిందే పాల పిట్ట.. తెచ్చిందే పూల బుట్ట అంటూ పాటలు కూడా పాడింది. అయితే శ్రీహాన్ తప్పుడు ఉద్దేశంతో అలా అనకపోయినా ఇనయా మాత్రం కావాలనే గొడవ పెట్టుకున్నట్లు కనిపించింది. పైగా బాడీ షేమింగ్ అనే పదాలు కూడా వాడింది. ఈ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.