బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన యూట్యూబర్స్ లో ఆదిరెడ్డి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆదిరెడ్డి.. హౌస్ లో అందరి పోటీ తట్టుకొని తనదైన శైలిలో టాప్ 5 వరకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక తన లైఫ్ గురించి, లైఫ్ లో తాను ఎదగడానికి.. ఈ స్థాయికి రావడానికి సహకరించిన వారిలో తన భార్యతో పాటు చెల్లి కూడా ఉందని చాలాసార్లు చెప్పాడు.
బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన యూట్యూబర్స్ లో ఆదిరెడ్డి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆదిరెడ్డి.. హౌస్ లో అందరి పోటీ తట్టుకొని తనదైన శైలిలో టాప్ 5 వరకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక తన లైఫ్ గురించి, లైఫ్ లో తాను ఎదగడానికి.. ఈ స్థాయికి రావడానికి సహకరించిన వారిలో తన భార్యతో పాటు చెల్లి కూడా ఉందని చాలాసార్లు చెప్పాడు. ఇక బిగ్ బాస్ షో తర్వాత మళ్లీ ఏ టీవీ షోలోను కనిపించలేదు ఆదిరెడ్డి. కానీ.. చాలా గ్యాప్ తర్వాత ఉమెన్స్ డే సందర్భంగా స్టార్ మా వారు నిర్వహించిన ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ప్రోగ్రామ్ కి తన సోదరితో హాజరయ్యాడు.
ఈ క్రమంలో తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి.. కారణమైన తన చెల్లి గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆదిరెడ్డి. ఈ ప్రోగ్రాంలో సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు చాలామంది పాల్గొని సందడి చేశారు. కానీ.. ఆదిరెడ్డి తన చెల్లికి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చి.. ఎమోషనల్ అయిన మూమెంట్ ప్రేక్షకుల గుండెలను కదిలిస్తోంది. “నా చెల్లి పెన్షన్ డబ్బుతోనే నేను బెంగుళూరు వెళ్లా.. నా చెల్లి పెన్షన్ డబ్బుతోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి.. ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పుడు నా చెల్లెల్ని ఇక్కడ నిలబెట్టా.” అని ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత ఆదిరెడ్డి తన చెల్లికి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘నేను, కవిత వెళ్లి నా బిగ్ బాస్ డబ్బులతో ఒక గోల్డ్ నెక్లెస్ తీసుకొని వచ్చాం..” అని చెల్లి చేతిలో పెట్టాడు. అది చూసి ఆదిరెడ్డి చెల్లి.. భావోద్వేగానికి గురై.. “బంగారానికి కాదు.. నేను నా అన్యయ్యకు విలువ ఇస్తాను” అని ఆదిరెడ్డిని హగ్ చేసుకుంది. తర్వాత తాను తెచ్చిన నెక్లెస్ ను చెల్లి మెడలో వేశాడు ఆదిరెడ్డి. ప్రస్తుతం ఆదిరెడ్డి, తన సోదరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమెన్స్ డే సందర్భంగా ఆదిరెడ్డి తన చెల్లికి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వడంతో అందరూ ఎమోషనల్ అవుతూనే.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రోమోలో గమనించినట్లయితే.. ఆదిరెడ్డికి, తన సోదరి మధ్య బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.