తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఇందులో బిగ్ బాస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ కి మొదట ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, ప్రస్తుతం వరుసగా కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హూస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 2కి నాని హూస్ట్ గా కొనసాగారు. ఆ తర్వాత మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ఆరు లో అర్జున్ కళ్యాణ్ లవర్ బాయ్ గా బాగా అలరించాడు. అలాగే శ్రీసత్య, వాసంతి తమ అందంతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొన్న సభ్యులు వివిధ షోల్లో అలరిస్తున్నారు. తాజాగా ఓ షోలో అర్జున్ కళ్యాణ్ ని ఈ ఇద్దరు భామలు ముద్దుల్లో ముంచెత్తారు. వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ ఆరో సీజన్ లో అర్జున్ కళ్యాణ్ తన మాటతీరు.. అమాయకత్వంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సీజన్ లో అందాల భామలు వాసంతి, శ్రీ సత్యతో అర్జున్ కళ్యాన్ లవ్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరితో అర్జున్ పులిహోర కలపడం.. వీక్ ఎండ్ కి నాగార్జున వచ్చి కామెంట్స్ చేయడం ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ మెంట్ చేసింది. మొదట వాసంతితో అర్జున్ కళ్యాన్ దగ్గరవుతున్నట్లు అనిపించినా.. ఆమె ఎలిమినేట్ అయ్యాక.. శ్రీ సత్యతో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. గేమ్ లో ఆమెకోసం త్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయం వీక్ ఎండ్ లో నాగార్జున ఎవరి గేమ్ వాడే ఆడాలి.. ఇక్కడ త్యాగాలు చేస్తే ఎలిమినేట్ అవుతారని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
బిగ్ బాస్ ఆరో సీజన్ లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య బాండింగ్ ఏర్పడుతుందనుకున్న సందర్భంలో అనూహ్యంగా అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. బయటికి వచ్చిన తర్వాత స్టేజ్ పై అర్జున్, శ్రీ సత్యను తల్చుకొని కన్నీరు కూడా పెట్టుకున్నాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ లో ఇద్దరు భామలతో లవ్ ట్రాక్ నడపాలని చూసినా.. ఎలిమినేషన్ కారణంగా దూరమయ్యాడు. కానీ ఆ గ్యాప్, కోరిక మరో ప్రోగ్రామ్ తో నెరవేరింది. తాజాగా ఓంకార్ షో సిక్త్స్ సెన్స్ సీజన్ 5 లో అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జంటలుగా హాజరయ్యారు. సిక్త్స్ సెన్స్ లో ఓంకార్ ఓక్క నిమిషం అనే డైలాగ్ తో ఎదుటివారికి పెట్టే టెన్షన్ అంతా ఇంతా కాదు. అర్జున్ కళ్యాణ్ పై శ్రీ సత్య గన్ ఎక్కు పెట్టడం.. ఓంకార్ పెట్టిన తికమక షో చాలా ఉత్కంఠంగా సాగింది.
గేమ్ మద్యలో ఈ జంటలు స్టేజ్ పై డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తుండగా అర్జున్ బుగ్గపై వాసంతి ముద్దు పెట్టింది. తానేం తక్కువ తిన్నా అంటూ శ్రీ సత్య కూడా అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇలా ఈ ఇద్దరు భామలు బుగ్గలపై ముద్దు పెట్టడంతో అర్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది చూసి మెహబూబ్ ఏంటమ్మా.. మాకేం లేవా అంటూ కామెడీ చేశాడు. దీంతో ఓంకార్ తో సహ ఆడియన్స్ నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రోమోపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ కి అప్పుడు తీరని కోరిక ఇప్పుడు తీరిపోయిందని.. మనోడో భలే లక్క ఫెలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.