ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది.. అయినా ఇంకా దాని గురించే చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం.. బిగ్ బాస్ 6లో విన్నర్, రన్నరప్.. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? ఏం మాట్లాడారు? అని కాదు. బిగ్ బాస్ లోకి వెళ్లి.. ఫినాలేలో విన్నర్ గా, రన్నరప్ గా నిలిచినవారు ఎంతెంత అమౌంట్ గెలుచుకున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ సీజన్స్ ఎన్ని వచ్చిపోయినా ఆఖరి అందరి ఇంటరెస్ట్ విన్నర్, రన్నరప్ లతో పాటు మిగతా వారంతా ఎంతెంత రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు? మొత్తంగా ఎంత వెనకేసుకున్నారు అనేవి ప్రధానాంశాలు. దీంతో ఇప్పుడు సీజన్ 6 ముగియడంతో విన్నర్, రన్నరప్ లు ఎంత సంపాదించుకున్నారని మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6లో సింగర్ రేవంత్ విన్నర్ గా ట్రోఫీ అందుకోగా.. రన్నరప్ గా నిలిచాడు శ్రీహన్. అయితే.. ఈ సీజన్ లో ఫైనాన్సియల్ గా లాభాలు పండించింది ఎవరంటే..? శ్రీహాన్ అని అంటున్నారు. టైటిల్ విన్నర్ కి రావాల్సిన రూ. 50 లక్షల్లో.. సూట్ కేసు ఆఫర్ తో రూ. 40 లక్షలు పట్టుకెళ్లిపోయాడు శ్రీహన్. దీంతో విన్నర్ రేవంత్ కి ప్రైజ్ మనీలో మిగిలిన రూ. 10 లక్షల క్యాష్.. ఓ రూ. 30 లక్షలు విలువచేసే ఫ్లాట్.. రూ. 10 లక్షల బ్రెజా కారు అందాయి. అదీగాక రేవంత్ మొత్తం హౌస్ లో 15 వారాలు ఉన్నాడు. కాబట్టి.. వారానికి 2 లక్షలు చొప్పున రూ. 30 లక్షలు, అదనంగా కొన్ని వారాల రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తోంది.
ఇక ఓట్ల పరంగా చూసుకుంటే శ్రీహన్ మెజార్టీతో ముందున్నాడని హోస్ట్ నాగార్జున చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా శ్రీహన్ ఎంత మొత్తం అందుకున్నాడు? అనే విషయంలోకి వస్తే.. సువర్ణభూమి వారి ఫ్లాట్ కొంటే 50% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు.. ఆ విధంగా చూసుకుంటే శ్రీహన్ కి ఎక్కువ మొత్తం ముట్టినట్లే లెక్క. హౌస్ లో 15 వారాలు ఉన్నాడు. కానీ, సూట్ కేస్ ఆఫర్ వలన రన్నరప్ గా నిలిచాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీహన్ కి వారానికి లక్ష రూపాయలు ఇచ్చారట. ఆ లెక్కన 15 వారాలకు రూ. 15 లక్షలు.. స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ గా రూ.5 లక్షలు బోనస్.. సూట్ కేస్ ఆఫర్ తో రూ. 40 లక్షలు.. మరోవైపు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్.. మొత్తంగా చూసుకుంటే శ్రీహన్ దాదాపు రూ. 70 లక్షల వరకు అందుకున్నాడని టాక్. మరి మీ అంచనా ప్రకారం శ్రీహన్ ఎంత మొత్తం అందుకొని ఉంటాడో కామెంట్స్ లో తెలపండి.