ఏపీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ గుంతలు తేలి.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై గతంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు పలుమార్లు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన ఓ పని ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఆమెను ప్రశంసిస్తున్నవారు కొందరైతే.. కేంద్రంపై ఆరోపణలు సరే.. మరీ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు.. ఇక్కడ పరిస్థితులు మీకు కనిపించడం లేదా అని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : హీరో నానిపై ఎమ్మెల్యే రోజా సెటైర్లు
గురవారం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడలో స్పెషల్ సెక్రటరీ టూ గవర్నమెంట్ (రహదారులు, భవనల శాఖ) కృష్ణబాబుని(ఐఏఎస్) కలిశారు. నగరి నియోజకవర్గ పరిధిలోని రోడ్ల దుస్థితిపై వినతి పత్రాన్ని అందించారు. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు చేపట్టిన రోడ్డు పనులు అధ్వాన్నంగా ఉన్నాయని.. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు దెబ్బతిన్నాయని.. ఫలితంగా ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతూ.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతూ.. వినతి పత్రం సమర్పించారు.
ఇది కూడా చదవండి : జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ..?రోజా చేసిన పనిపై నెటిజనులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘కనీసం మీరైనా రోడ్ల దుస్థితి గురించి మాట్లాడారు.. చాలా మంచి పని చేశారు’ అని ప్రశంసించాగా.. మరి కొందరు మాత్రం.. ‘కేంద్రం మీద విమర్శలు చేయడం కాదు.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు కూడా అంతే అధ్వాన్నంగా ఉన్నాయి.. మరీ వాటి గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలి.. అధికారంలో ఉన్న మీకు ఇది కనిపించడం లేదా’ అని విమర్శిస్తున్నారు. మంచి చేద్దామని చేసిన పని కాస్త ఇలా బెడిసి కొట్టడంతో.. తల పట్టుకునే పరిస్థితి ఎదురయ్యింది అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎమ్మెల్యే రోజా చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి