ఏదైనా సమస్య వస్తే.. మనలో చాలా మంది ఆ.. మనకెందుకులే అనుకుంటారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిష్కార మార్గం ఆలోచిస్తారు.. అప్పటివరకు అందరితో పాటు మనం అన్నట్లు.. నిమ్మకు నిరేత్తినట్లు ఉంటారు. అదే ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి సమస్య ఎదురైతే.. ఉన్నతాధికారులు చూసుకుంటారు.. మనకేందుకు.. అని పక్కకు తప్పుకుంటారు. కానీ అందరూ ఇలానే ఆలోచిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేది ఎలా.. ఎవరో ఒకరు ధైర్యంగా ముందడుగు వేయాలి.. అప్పుడే ఫలితం ఉంటుంది. సరిగా ఈ కోవకు చెందిన ఓ కానిస్టేబుల్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎదురవతున్న ఓ సమస్య వల్ల కొన్ని నెలలుగా తాను.. మిగతా సహోద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి చర్చించుకుని బాధపడటమే తప్ప.. దాని పరిష్కారం దిశగా ఎవరు ఆలోచించడం లేదు. ఈ క్రమంలో సదరు ఏఆర్ కానిస్టేబుల్ నడుం బిగించి ముందుకు వచ్చి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లెలా చేయగలిగాడు. ఫలితంగా నెలల తరబడి వేధిస్తున్న సమస్యకు వెంటనే పరిష్కారం దొరికింది. ఇంతకు ఏంటా సమస్య.. ప్రభుత్వ స్పందన ఏంటి వంటి వివరాల కోసం ఇది చదవవండి..
ఏపీ ప్రభుత్వం పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో విడుదల కాక.. ఆ శాఖ ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు తప్ప.. దాన్ని తీర్చే మార్గం దిశగా ఎవరు ఆలోచించలేదు. ఈ క్రమంలో అనంతపురంలో విధులు నిర్వహిస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ముందుకు వచ్చాడు. ధైర్యం చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దానిలో భాగంగా.. అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం దగ్గర ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డును ప్రదర్శించాడు.
ఇది కూడా చదవండి: Village: ఆ ఊర్లో చెప్పులు వేసుకుని నడిస్తే శిక్ష తప్పదు..
ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పుకొచ్చాడు ప్రకాష్. తమకు ప్రతి ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన సరెండర్ లీవులు (ఎస్‌ఎల్‌ఎస్), అడిషనల్ సరెండర్ లీవులు (ఏఎస్‌ఎల్‌ఎస్) మూడు విడతలుగా పెండింగ్‌లో ఉన్నాయని ప్రకాష్ తెలిపాడు. 14 నెలల నుంచి తమకు టీఏ(ట్రాన్స్‌పో ర్ట్ అలవెన్స్)లు అందడం లేదని, పెంచిన ఆరు డీఏల అరియర్స్ పరిస్థితి కూడా అంతే అన్నారు. ఇవన్నీ బకాయిల రూపంలోనే ఉండిపోయాయని.. ఇలా ఒక్కో కానిస్టేబుల్‌కు ప్రభుత్వం రూ.1.80 లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
ఇక ప్రభుత్వం తమకు ఇవన్నీ చెల్లించకపోయినా కూడా.. అధికారులు మాత్రం.. ఆదాయ పన్ను రూపంలో తమ వేతనాల్లో ఈ మొత్తాన్ని కట్ చేశారని ప్రకాష్ తెలిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ప్రకాష్ గత నెల 29న మంత్రుల సామాజిక న్యాయ భేరి సదస్సు సందర్భంగా అనంతపురం జిల్లాకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులకు కానిస్టేబుల్ ప్రకాష్ వినతి పత్రాలు అందజేశాడు.
ఇది కూడా చదవండి: పోలీస్ కాలర్ పట్టుకున్న కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరి!
అయినా ఫలితం లేకపోవడంతో లాభం లేదనుకుని రోడెక్కాడు. అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం దగ్గర ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డును ప్రదర్శించాడు ప్రకాష్. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వారు తక్షణమే స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రకాష్‌పై అతడి సహోద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు కానీ.. ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయలేదని.. కానీ ప్రకాష్ తామందరి కోసం ఆలోచించి ముందడుగు వేశాడని.. అతడి వల్లే సమస్య పరిష్కారం అయ్యిందంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Land And House: 60 రూపాయలకే 11 ఎకరాల భూమిని సొంతం చేసుకున్న కుటుంబం!