Chhattisgarh: మద్యం సేవించి వాహనం నడపడమే కాదు, తాగి వ్యవస్థలని, సంస్థలని నడపడం కూడా తప్పే. విద్యార్థులు తప్పు చేస్తే శిక్షించాల్సిన టీచర్లే తప్పులు చేస్తే ఇక ఈ సమాజం ఎటు పోవాలే? ఈ సమాజాన్ని నడిపించే శక్తి ఉన్న గురువులు మద్యం తాగి స్కూల్‌కి రావొచ్చా? ఇప్పటికే విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి క్లాసులకి రావడం వంటివి చేసి.. కొంతమంది ఉపాధ్యాయులు గురు వృత్తికే మాయని మచ్చ […]
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. తమ సేల్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో విధానాన్ని అవలంభిస్తారు. ఎలాంటి వ్యాపారానికైనా కస్టమర్లని ఆకర్షించడం ముఖ్యం. కొందరు ఈ పాయింట్ ని బేస్ చేసుకుని తమ వ్యాపారాన్ని క్యాష్ చేసుకుంటారు. తమ టాలెంట్ తో కస్టమర్లనే కాకుండా నెటిజన్లను సైతం ఆకర్షిస్తూ సెలబ్రిటీలు అవుతారు. అలాంటి వారిలో దేవలఖాన్ గుప్తా ఒకరు. ఈయన ఛత్తీస్ గడ్ లోని బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ బస్టాండ్ ఎదురుగా […]
ఈరోజుల్లో నా చావు నేను చస్తా, పక్కనోడు ఎలా చస్తే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. కానీ ఇతను మాత్రం సమ్ థింగ్ స్పెషల్. ఆపద వచ్చినప్పుడు మనం మాత్రమే కాదు, ఊరు కూడా బతకాలి అని అనుకున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామానికి చెందిన గోనెల నాని. వరద ముంపు నుండి 1200 మందిని రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా […]
మన సమాజంలో ఎన్నో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఆకాశంలోకి రాకెట్ పంపిస్తాం.. కానీ ప్రయోగానికి ముందు దానికి పూజ చేస్తాం. శాస్త్రాన్ని మించిన మహా శక్తి ఏదో ఉందని.. మెజారిటీ ప్రజలు నమ్ముతారు. వుడిని నమ్మినట్లే దెయ్యాలను, ఆత్మలను కూడా నమ్ముతారు. భిన్నమైన ఈ రెండు శక్తులకు భయపడతారు. భూమిపై ఉన్న పంచభూతాలను సైతం దైవంగా కొలిచే సమాజం మనది. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు చేస్తాం. కప్పలకు పెళ్లిల్లు చేస్తాం.. ఇంకా అలాంటి ఆచారాలు చాలానే ఉన్నాయి. […]
పోలీసులు అంటే ప్రజలకు రక్షకులు. ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవతలి వ్యక్తిని పిలిపించి విచారణ జరిపి న్యాయ అన్యాయాలను పరిశీలించి ఎవరు వైపు న్యాయం ఉంటే న్యాయం జరిగేలా చేయాలి. కానీ కొందరు పోలీసులు అలా వచ్చిన వారికి అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోయి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తునారన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్సై సమీర్ […]
సకాలంలో వైద్యం అందటం అనేది నేటికి కూడా మనదేశంలో అందని ద్రాక్షగానే మారింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎలా దోచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు సరిపడా ఉండవు.. ఉన్నా.. కొన్ని చోట్ల వారు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో.. ఇప్పటికే అనేక మార్లు చూశాం. ఈ క్రమంలో తాజాగా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో.. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆర్టీసీ బస్సే ఆస్పత్రిగా మారింది. ఆ వివరాలు.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు […]
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ప్రతిపక్షాలు, విపక్షాలు ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు.. సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకు పడ్డారు. శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం […]
Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మోదీ.. రోడ్డుపై కనిపించిన చెత్తను స్వయంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటి చెప్పారంటూ కేంద్రమంత్రి తెలిపారు. ఇక ఢిల్లీలో నిర్మితమైన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న […]
దేశానికి సేవ చేయాలనుకున్నాడు.. కానీ, దేశపౌరుల చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు. బోర్డర్‌లో శత్రు దేశ సైనికులను మట్టు బెట్టాలనుకున్నాడు. కానీ, బుల్లెట్లకు బలయ్యాడు. దేశ సేవలో మరణిస్తే.. అమరుడయ్యాడు అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు ఆందోళనలో తనువు చాలించాడు. అతనే 18 ఏళ్ల రాకేశ్. అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసుల తూటాలకు బలయ్యాడు రాకేశ్. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. అగ్నిపథ్‌కు కార్యక్రమానికి వ్యతిరేకంగా యువకులు ఆందోళనకు దిగడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత […]
ఏదైనా సమస్య వస్తే.. మనలో చాలా మంది ఆ.. మనకెందుకులే అనుకుంటారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిష్కార మార్గం ఆలోచిస్తారు.. అప్పటివరకు అందరితో పాటు మనం అన్నట్లు.. నిమ్మకు నిరేత్తినట్లు ఉంటారు. అదే ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి సమస్య ఎదురైతే.. ఉన్నతాధికారులు చూసుకుంటారు.. మనకేందుకు.. అని పక్కకు తప్పుకుంటారు. కానీ అందరూ ఇలానే ఆలోచిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేది ఎలా.. ఎవరో ఒకరు ధైర్యంగా ముందడుగు వేయాలి.. అప్పుడే ఫలితం ఉంటుంది. సరిగా ఈ కోవకు […]