Chhattisgarh: మద్యం సేవించి వాహనం నడపడమే కాదు, తాగి వ్యవస్థలని, సంస్థలని నడపడం కూడా తప్పే. విద్యార్థులు తప్పు చేస్తే శిక్షించాల్సిన టీచర్లే తప్పులు చేస్తే ఇక ఈ సమాజం ఎటు పోవాలే? ఈ సమాజాన్ని నడిపించే శక్తి ఉన్న గురువులు మద్యం తాగి స్కూల్‌కి రావొచ్చా? ఇప్పటికే విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించి క్లాసులకి రావడం వంటివి చేసి.. కొంతమంది ఉపాధ్యాయులు గురు వృత్తికే మాయని మచ్చ తెచ్చారు. తాజాగా మరో ఉపాధ్యాయురాలు ఈ జాబితాలోకి చేరిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో టికైత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న జగపతి భగత్ అనే ఉపాధ్యాయురాలు తాగి పాఠశాలకు వచ్చింది.
తాగిన మత్తులో అటూ ఇటూ తూలుతూ సరిగా నడవడలేక తెగ ఇబ్బంది పడింది. కాసేపటికి ఆమె కుర్చీలో కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత నేల మీద పడుకుంది. ఈ విన్యాసాలు చూసిన విద్యార్థులు.. టీచర్‌ను ఆటపట్టించారు. ఆ తర్వాత ఆమెను పై అధికారులకు పట్టించారు. దీంతో ఈమెను విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు. పాఠశాలను తనిఖీ చేయడానికి విద్యాశాఖ అధికారులు రావడంతో ఈమె బాగోతం బయటపడింది. తనిఖీలో భాగంగా క్లాస్‌కి వచ్చేటప్పటికీ ఆమె మత్తుగా నిద్రపోతోంది. టీచర్ పడుకుని ఉండడంపై అధికారులు ఆరా తీశారు. అయితే తొలుత ఆమె తన ఆరోగ్యం బాలేదని ఆమె చెప్పింది. నమ్మశక్యంగా లేకపోవడంతో అధికారులు విద్యార్థులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆమె వేసిన వేశాలు బయటపడ్డాయి. ఆమె మద్యం సేవించిందని తెలియడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇలా అనేక మంది ఉపాధ్యాయులు మద్యం తాగొచ్చి.. సస్పెండ్‌కు గురయ్యారు. మరి నీతులు చెప్పే టీచర్లే ఇలా నీతి తప్పుతుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మద్యపానం నిషేధించి.. గంజాయి-భంగ్‌ని ప్రోత్సహించాలన్న బీజేపీ ఎమ్మెల్యే!
ఇది కూడా చదవండి: వీడియో: పబ్ లో యువకుడిపై మహిళల దాడి.. చివరికి..