రాష్ట్రం ఏదైనా.. ఎన్నికలు ఏవైనా నేతల ఎక్కువగా ఇచ్చే హామీ మద్యపాన నిషేదం. మద్యం వల్ల ఎన్నో కాపురాలు రోడ్డున పడుతున్నాయి, ఎందరో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే అందరు నేతలు అదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తారు. అయితే ఇప్పు ఓ బీజేపీ ఎమ్మెల్యే మద్యపానం విషయం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానాన్ని నిషేదించి కావాలంటే గంజాయి, భంగ్ ని ప్రోత్సహించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం వల్లే అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. మార్వాహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్ చట్టం ప్రకారం గంజాయి అమ్మకం, సేవన నేరమని.. కానీ, వాటిని పెంపకానికి అనుమతి ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ ఇలా అన్నారు... “ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. గతంలో అసెంబ్లీలోనూ ఓసారి చర్చించాను. అత్యచారం, హత్యలకు మద్యపానమే కారణమని అనేకసార్లు చెప్పాను. గంజాయి తాగిన వ్యక్తి ఎప్పుడైనా అత్యాచారానికి పాల్పడ్డాడా? మద్యపాన నిషేదంపై ఓ కమిటీ వేసి.. గంజాయి, భంగ్ వినియోగం దిశగా ఆలోచించాలి. ప్రజలు మత్తుని కోరుకుంటే అది దారుణాలకు దోహదపడేలా ఉండకుండా చూడాలి” అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండాలి అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందంటూ ఎదురు ప్రశ్న వేశారు. జులై 27న బీజేపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన చర్చలో ఈ అంశం లేవనెత్తుతానంటూ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి. ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #BJPMLAडॉकृष्णमूर्तिबाँधी कह रहे हैं कि भांग और गांजे को आगे बढ़ाने के लिए सरकार को विचार करना चाहिए, विधायक मानते हैं कि शराब से अपराध बढ़ता है, और ये भी मानते हैं कि भांग या गांजे का सेवन करने वाले अपराध नहीं करते हैं, महोदय शराब का विकल्प गांजा और भांग को बता रहे है. pic.twitter.com/beEqW0azS0 — Pawan Durgam (@PawanDurgam5) July 24, 2022 ఇదీ చదవండి: 15వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇదీ చదవండి: నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డుపై దొరికిన.. రూ. 45 లక్షలను..!