గతంలో ఆస్తులు ఎన్ని ఆస్తులున్నాయని అని అడిగేవారు కాదట. ఎంత మంది పిల్లలున్నారని ప్రశ్నించేవారట. అంటే అప్పట్లో పిల్లల్ని ఆస్తులుగా భావించేవారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, పిల్లల్ని కనడమే పనిగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నం..
గతంలో ఆస్తులు ఎన్ని ఆస్తులున్నాయని అని అడిగేవారు కాదట. ఎంత మంది పిల్లలున్నారని ప్రశ్నించేవారట. అంటే అప్పట్లో పిల్లల్ని ఆస్తులుగా భావించేవారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, పిల్లల్ని కనడమే పనిగా ఉండేది. కాగా, వారిని పెంచలేక, నానా కష్టాలు పడేవారు. కడు పేదరికంతో పిల్లలకు ఒక పూట భోజనం పెట్టని కుటుంబాలు ఉన్నాయి. కానీ నేడు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం చొరవ తీసుకుని ఇద్దరు పిల్లలే ముద్దు అనే కాన్సెప్ట్ తెచ్చింది. దీంతో కుటుంబ వ్యవస్థ ఆర్థికంగా మెరుగు పడింది. కానీ పెరుగుతున్న ఖర్చులు, ఇతర ఉద్దేశాల నేపథ్యంలో ఒక్కరు ఉంటే చాలు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు భార్యా భర్తలు.
అయితే దేశంతో పాటు మహిళలు మానసికంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కూడా.. మారుమూల ప్రాంతాల మహిళలు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చత్తీస్ గఢ్‌కు చెందిన ఆదివాసి మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇది ఆమెకు ఎనిమిదో కాన్పు కావడం గమనార్హం. బీజాపూర్ జిల్లా బట్టిగూడానికి చెందిన పుజ్జ అనే మహిళకు ఈ నెల 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే తొలుత ఆమె ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. అంతతో మళ్లీ ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో వైద్యులు కాన్పు చేసి..మరో ఆడ బిడ్డను బయటకు తీశారు.
పుజ్జకు ఇప్పటికే ఏడుగురు పిల్లలున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో ఆమె పిల్లల్ని కంటూనే ఉంది. ఇప్పుడు ఆమెకు 29 ఏళ్లు. పది మంది పిల్లలకు తల్లైంది. వీరిలో నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన బిడ్డలతో కలిపితే ఐదుగురు ఆడపిల్లలు, ఐదుగురు మగపిల్లలు అయ్యారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. సాధారణ కాన్పు అయ్యేలా కృషి చేసిన నర్సు, ఇతర సిబ్బందిని ఆసుపత్రి అధికారులు అభినందించారు.