దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పనులు జరగాలంటే లంచం ఇవ్వక తప్పదు అంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా చేయి తడపనిదే పనులు జరగవని ఎంతోమంది బాధితులు అంటుంటారు.
మన దేశంలో పైస లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగదు అని అంటారు. మనదేశాన్ని పట్టిపీడిస్తున్న వాటిలో అవినీతి, లంచగొండితనం. ప్రభుత్వ పథకాలు కానీ, ఏ ఇతర అవసరాలు కానీ లంచం ఇవ్వకుండా పనులు చేయించుకోవాలని అంటారు.. కానీ ఇక్కడ చేయి తడపనిదే పనులు కావు అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇస్తే పుచ్చుకుంటాం అని అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు అంటుంటే.. అడుగుతున్నారు కాబట్టే ఇస్తున్నామని సామాన్య ప్రజలు అంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు లంచం తీసుకుంటూ పట్టబడింది ఓ ప్రభుత్వ అధికారిణి. వివరాల్లోకి వెళితే..
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ఓ మహిళ మొదటిరోజే లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యింది. సదరు మహిళా అధికారి మితాలీ శర్మ. రూ. 10 వేల లంచం తీసుకుంటూ తన ఛాంబర్ లోనే దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. గర్హై గ్రామానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ యాదవ్, తండ్రి దివంగత మంగన్ యాదవ్ అనే వ్యక్తి నుంచి ఒక దరఖాస్తు నిమిత్తం ఆమె లంచం డిమాండ్ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన మితాలీ శర్మని కలవడానికి రామేశ్వర్ ప్రసాద్ ని తన ఛాంబర్ కి రమ్మని చెప్పింది. రామేశ్వర్ పని సక్రమంగా కావాలంటే తనకు రూ.20,000 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అప్పటికే ఆఫీసు చుట్టూ తిరిగీ తిరిగీ ఉన్న రామేశ్వర్ అసహనానికి గురయ్యాడు. ఈ విషయం అప్పటికే రామేశ్వరప్రసాద్ ఏసీబీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ మిథాలీ శర్ ని తన అధికారిక నివాసంలోనే 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసింది. రామేశ్వర్ వద్ద లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీ బృందం ధృవీకరించింది. అనంతరం మితాలీ శర్మ ని హజారీబాగ్‌కు తీసుకెళ్లినట్లే ఏసీబీ అధికారులు తెలిపారు.