ఈరోజుల్లో నా చావు నేను చస్తా, పక్కనోడు ఎలా చస్తే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. కానీ ఇతను మాత్రం సమ్ థింగ్ స్పెషల్. ఆపద వచ్చినప్పుడు మనం మాత్రమే కాదు, ఊరు కూడా బతకాలి అని అనుకున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామానికి చెందిన గోనెల నాని. వరద ముంపు నుండి 1200 మందిని రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా గానీ గ్రామస్తులు మాత్రం అక్కడి నుండి కదిలేది లేదని మొండికేశారు. వరద ఉదృతి తగ్గుముఖం పట్టేవరకూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు రిక్వస్ట్ చేశారు. కానీ ఇల్లు, వాకిలి, సామాన్లు, బర్రెలు, గొర్రెల్ని వదిలిపెట్టి రావడం కుదరదని స్థానికులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన గోనెల నాని.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. వారికి పరిస్థితిని అర్ధమయ్యేలా వివరించి పునరావాస కేంద్రాలకు తరలించేలా అధికారులకు సహాయం చేశాడు.
వారం రోజుల పాటు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కు తోడుగా ఉంటూ.. వారికి స్థానికంగా ఉన్న పరిస్థితులను గైడ్ చేస్తూ వచ్చాడు. స్థానికంగా ఉండే గిరిజనుల మనస్తత్వాన్ని, ఆలోచనలను వివరించి, వారిని ఎలా సముదాయించాలో వివరించాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకొచ్చిన పడవల్లో ఎక్కడానికి, ఇంటి నుంచి బయటకు రావడానికి స్థానికులు సహకరించకపోవడంతో.. వారికి దైర్యం చెప్పి మోటివేట్ చేశాడు గోనెల నాని. దీంతో స్థానికులు పడవల్లో ఎక్కి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గుముఖం పట్టాక పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇంటికి చేరుకున్న స్థానికులు నానికి కృతజ్ఞతలు తెలిపారు. నాని మాట వినకపోయి ఉంటే ప్రమాదంలో పడేవాళ్లమని అన్నారు.
తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన నానిని.. ఎన్డీఆర్‌ఎఫ్ టీం కమాండర్ మన్మోహన్ యాదవ్ ప్రశంసించారు. వరద సాయం, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వచ్చిన ఐజీ నాగిరెడ్డి సైతం నాని సేవలను గుర్తించి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి యువకుడు ఊరికొక్కరుంటే చాలని అభినందించారు. ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో అనేక సందర్భాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి అందరి మన్ననలు పొందాడు గోనెల నాని. కోవిడ్ సమయంలో కరోనాతో మరణించిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా.. మణుగూరు అటవీ ప్రాంతంలో వాహనం బ్రేక్ డౌన్ అయ్యింది. ఆ సమయంలో వాహనంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నాలుగు గంటల పాటు సహాయం కోసం ఎదురుచూశారు. బోరున వర్షం పడుతోంది. అంత వర్షంలోనూ ఎవరో ఆదివాసీ మహిళ ఇచ్చిన సమాచారంతో రాత్రి సమయంలో గోనెల నాని.. ఆ ప్రదేశానికి వాహనంలో వెళ్లి మృతదేహాన్ని సురక్షితంగా తరలించేందుకు కృషి చేశాడు. మరి ఈ రియల్ హీరోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దారుణం: కల్తీ సారా తాగి 9 మంది అమాయకులు మృతి!
ఇది కూడా చదవండి: Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రోజుకు రూ. 50 పొదుపుతో రూ. 35 లక్షల ప్రయోజనం!