కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. తమ సేల్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో విధానాన్ని అవలంభిస్తారు. ఎలాంటి వ్యాపారానికైనా కస్టమర్లని ఆకర్షించడం ముఖ్యం. కొందరు ఈ పాయింట్ ని బేస్ చేసుకుని తమ వ్యాపారాన్ని క్యాష్ చేసుకుంటారు. తమ టాలెంట్ తో కస్టమర్లనే కాకుండా నెటిజన్లను సైతం ఆకర్షిస్తూ సెలబ్రిటీలు అవుతారు. అలాంటి వారిలో దేవలఖాన్ గుప్తా ఒకరు. ఈయన ఛత్తీస్ గడ్ లోని బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ బస్టాండ్ ఎదురుగా తోపుడు బండిపై మసాలా శనగలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అందరిలా అమ్మితే ప్రత్యేకత ఏముంది అని తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ని సెట్ చేసుకున్నారు. బండికి మైక్ తగిలించి.. ‘నాణ్యమైన, రుచికరమైన మసాలా శనగలు అమ్మబడును’ అంటూ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రచారం చేస్తున్నారు. కేవలం పది రూపాయలకే 50 గ్రాములు అంటూ మైకులో బస్టాండ్ కి వచ్చే ప్రయాణికులను ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఇలానే తన వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
అలా అని ఈయనేమీ నిరక్ష్యరాస్యుడు కాదు. ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని, ఎలా పడితే అలా ఉంటూ అమ్మే టైపు కూడా కాదు. నీట్ గా ఇన్ షర్ట్ చేసుకుని చదువుకున్న వ్యక్తిలా హుందాగా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. స్వతహాగా చదువుకున్న వ్యక్తి కావడంతో ఇంగ్లీష్ నేర్చుకుని మరీ ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. మొదట్లో వచ్చీ రాని ఇంగ్లీష్ లోనే కస్టమర్లను ఆకట్టుకునేవారు. ఆ తర్వాత స్నేహితులు అతనికి ఇంగ్లీష్ నేర్పడంతో భాషలో పట్టు సంపాదించుకున్నారు. శనగలు కొనండి అనడమే కాకుండా, అవి తింటే కలిగే ప్రయోజనాలను కూడా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మైక్ లో చెబుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. “శనగల్లో ఉండే న్యూట్రియంట్స్ పెంచుతుంది ఫిట్ నెస్, ఉండదు ఎలాంటి వీక్ నెస్” అంటూ ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడే తీరు బస్టాండ్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో ఇలానే పశ్చిమ బెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కూడా.. కచ్చా బాదం అంటూ ఆకట్టుకునే పాటతో సైకిల్ పై తిరుగుతూ శనగలు, పల్లీలు, పప్పు దినుసులు అమ్ముకుంటూ ఫేమస్ అయ్యారు. ఆ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలోస్ షేర్ చేయడంతో అతను ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు. ఇప్పుడు దేవలఖాన్ కూడా ఇదే విధంగా ఏదో రోజు ఫేమస్ అవుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి చిరు వ్యాపారాలు టాలెంట్ తో కస్టమర్లని ఆకర్షించడమే కాకుండా నెటిజన్ల దృష్టిని సైతం ఆకర్షిస్తూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. బిజినెస్ ని పెంచుకోవాలంటే ఈ మాత్రం టాలెంట్ ఉండాలి. మరి ఈ వ్యాపారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 ప్రభుత్వ పాఠశాలల దత్తత!
ఇది కూడా చదవండి: SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!